- చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
- తండ్రి కళ్లెదుటే మృత్యువాత పడిన వైనం
- చిన్నారుల మృతితో కాట్రపల్లిలో విషాదఛాయలు
- చావులోనూ వీడని రక్తబంధం
శాయంపేట, న్యూస్‌లైన్ : ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన సంఘటన మండలంలోని కాట్రపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెం దిన అల్లె రవి, అనిత దంపతులకు ఇద్దరు కుమారులు భార్గవ్(8), నిఖిల్ (6), కూతురు శిరీష ఉన్నారు. అయితే కులవృత్తి రీత్యా రవి చేపలు పడుతుండగా.. ఆయన భార్య అనిత మండల సమాఖ్యలో సీఏగా పనిచేస్తుంది. కాగా, బుధవారం ఉదయం అనిత పని నిమిత్తం మం డల సమాఖ్య కార్యాలయానికి వెళ్లింది. దీంతో రవి మధ్యాహ్నం స్థానిక గుంటిచెరువులో చేపలు పట్టేందు కు తన ఇద్దరు కుమారులు భార్గవ్, నిఖిల్‌ను వెంట తీసుకెళ్లాడు.
ఈ సందర్భంగా ఇద్దరు పిల్లలను చెరువు గట్టుపై కూర్చొబెట్టిన రవి తెప్ప సాయంతో చెరువులోకి దిగి చేపలు పట్టుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నా డు. అయితే భార్గవ్, నిఖిల్‌లు చెరువుగట్టుపై ఆడుకుం టుండగా నిఖిల్ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయా డు. దీంతో భార్గవ్ భయంతో కేకలు వేస్తూ తండ్రిని పిలిచాడు. అనంతరం నీటిలో మునిగిన తమ్ముడు నిఖిల్‌కు చేయి అందించి పైకి లాగేందుకు ప్రయత్నిస్తుం డగా భార్గవ్ కూడా చెరువులో పడిపోయాడు.
కాగా, భార్గవ్ అరుపులను గమనించిన చుట్టుపక్కల పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు చెరువు వద్దకు వెళ్లి వారిని బయటికి తీసేందుకు ప్రయత్నించారు. కాగా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భార్గవ్ బయటికీ తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్య లో చనిపోయాడు.
ఇదిలా ఉండగా, నిఖిల్ ఆచూకీ కోసం రెండు గంటలపాటు స్థానికులు చెరువులో వెతి కారు. అనంతరం వలల సాయంతో గాలింపులు చేపట్టగా నిఖిల్ అప్పటికే చనిపోయి కనిపించాడు. కాగా, చిన్నారుల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు గుం డెల విసేలా రోదించారు. చెరువు వద్దకు తండ్రితో వెళ్లిన చిన్నారులు ఆకస్మాత్తుగా మృతిచెందడంతో కాట్రపల్లి లో విషాదఛాయలు అలుముకున్నాయి.