
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదని, ముమ్మాటికీ పాత ప్రాజె క్టేనని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలం గాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో కేంద్ర జల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సూచనలు, ఇచ్చిన సలహాల మేరకే పాత ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టామని వివరించింది. గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కిన నికర జలాలను వినియోగించుకుంటూనే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని, ఈ అంశంలో ఎలాంటి అంత ర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం లేదని వెల్లడించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టని, దానికి కేంద్రం, బోర్డు నుంచి అనుమతులు లేవంటూ ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) తమకు సమర్పిం చాలని ఇప్పటికే బోర్డు తెలంగాణను కోరింది. అయితే డీపీఆర్ సమర్పించలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని గత నెలలో విన్నవించింది. దీనికి నీటిపారుదలశాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషీ సానుకూలత తెలపడంతో శుక్రవారం సాయం త్రం ఆయన చాంబర్‌లో బోర్డు చైర్మన్ హెచ్‌కే సాహూ భేటీ అయ్యారు.
తెలంగాణ తరఫున ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు హాజర య్యారు. గోదావరి జలాల లభ్యత, వినియోగం, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు, రీ ఇంజనీరింగ్ అవ సరం, రిజర్వాయర్ల సామర్ధ్యం పెంపు వల్ల పెరి గిన అంచనా వ్యయాలపై జోషీ వివరణ ఇచ్చారు. అన్నింటిపై స్పష్టత తీసుకున్న బోర్డు... దీనిపై తమ అభిప్రాయాలను కేంద్రానికి తెలియ జేస్తామని తెలిపింది. బోర్డు వర్కింగ్ మాన్యువల్‌ౖ పెనా చర్చ జరిగింది. తాము అందించిన మాన్యు వల్‌పై అభిప్రాయాలు తెలపడంతోపాటు గోదా వరి బేసిన్ పరిధిలో చేపట్టిన, చేపట్టబోయే ప్రాజె క్టుల సమాచారాన్ని ఇవ్వాలని బోర్డు చైర్మన్ కోరగా అధికారులు అంగీకరించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment