ఆరు రాష్ట్ర ప్రాజెక్టులపై గోదావరి బోర్డు పెత్తనం! | Godavari projects in six of the state board authority | Sakshi
Sakshi News home page

ఆరు రాష్ట్ర ప్రాజెక్టులపై గోదావరి బోర్డు పెత్తనం!

Published Sat, Nov 19 2016 2:30 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

ఆరు రాష్ట్ర ప్రాజెక్టులపై గోదావరి బోర్డు పెత్తనం! - Sakshi

ఆరు రాష్ట్ర ప్రాజెక్టులపై గోదావరి బోర్డు పెత్తనం!

ఏపీ ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయం
► ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్, ఎల్లంపల్లి, కడెం, లోయర్ మానేరుపై అజమాయిషీ
► తమ పరిధిలోకి తీసుకుంటామంటూ ముసాయిదా నోటిఫికేషన్
► ఏపీ నుంచి కాటన్ బ్యారేజీనే పేర్కొన్న బోర్డు
► ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టులకున్న కేటాయింపులే వాడాలని సూచన
► అభ్యంతరాలకు 29 వరకు గడువు 

సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను వినియోగించుకుంటున్న తెలంగాణ ప్రాజెక్టులపై పెత్తనానికి గోదావరి బోర్డు తెరలేపింది. ఆంధ్రప్రదేశ్ ఒత్తిళ్లకు తలొగ్గి శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం ముసారుుదా (డ్రాఫ్ట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఏపీ నుంచి కేవలం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీయే తమ యాజమాయిషీ పరిధిలోకి వస్తుందన్న బోర్డు... తెలంగాణ సూచించిన పట్టిసీమ, తాడిపూడి, పుష్కర, వెంకటాపురం ప్రాజెక్టుల అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు.

ప్రాజెక్టుల పరిధిపై ఇప్పటికే కృష్ణా బోర్డుతో నెలకొన్న వివాదం ఏకంగా అపెక్స్ కౌన్సిల్ పంచాయితీ వరకూ వెళ్లగా ప్రస్తుతం గోదావరి ప్రాజెక్టుల నియంత్రణ అంశం ఎటువైపు మళ్లుతుందనేది ఆసక్తిగా మారింది. గోదావరి బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టులు, పరిధి అంశాలపై మూడు రోజుల కిందట బోర్డు చర్చించింది. ఈ సందర్భంగా బోర్డు పరిధి, నిర్వహణపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపిన బోర్డు అందుకు తగ్గట్లే శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 29 లోగా దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని అందులో స్పష్టం చేసింది.
 
నియంత్రణ అంతా బోర్డు చేతుల్లోకి..
బోర్డు విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం ఫేజ్-1లో భాగంగా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఆరు ప్రాజెక్టులు, ఏపీలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ బోర్డు పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాజెక్టుల బ్యారేజీ హెడ్‌వర్క్స్, డ్యామ్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, రెగ్యులేటర్లతోపాటు విద్యుత్ పాంట్ల హెడ్ వర్క్‌లు, రిజర్వాయర్ల పరిధిలోని ఎత్తిపోతల పథకాలు, నీటిని విడుదల చేసే ఇతర నిర్మాణాలన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయి. గతంలో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల మరకు లేదా ట్రిట్యునల్ ఇచ్చిన అవార్డుల మేరకు ప్రాజెక్టులవారీగా చేసిన కేటారుుంపుల మేరకే మేజర్, మీడియం ప్రాజెక్టుల్లో నీటి వినియోగం చేయాలి.

ఇందుకు రాష్ట్ర విభజన సమయానికి ఉన్న నీటి కేటారుుంపులనే పరిగణనలోకి తీసుకుంటారు. మైనర్ ఇరిగేషన్‌కు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. బోర్డు పరిధిలోకి రాకున్నా, రెండు రాష్ట్రాలతో సంబంధం ఉండే ఇతర ప్రాజెక్టులను సైతం బోర్డు స్వయంగా పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా, విద్యుదుత్పత్తిని నియంత్రించడంతోపాటు డ్యామ్, రిజర్వాయర్, రెగ్యులేటర్, కాల్వల నిర్వహణను చూస్తుంది. రిజర్వాయర్ల పరిధిలో చేపల పెంపకం అనుమతి లీజుల అంశాలన్ని పర్యవేక్షిస్తుంది. బోర్డు పేర్కొన్న లోయర్ మానేరు, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులు ఇంకా నిర్మాణ దశలో ఉన్నందున వాటికి సంబంధించిన పురోగతి నివేదికలు, డ్రాయింగ్‌లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది.
 
కొన్ని పనులు విడిగా..మరికొన్ని ఉమ్మడిగా..
రాష్ట్రాలు, బోర్డు విడివిడిగా, సంయుక్తంగా చేయాల్సిన పనుల అంశాన్ని సైతం గోదావరి బోర్డు నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంది. ప్రాజెక్టుల చారిత్రక వివరాలు, ప్రస్తుత డేటా, నిర్వహణ విధానం, ప్రభుత్వ నిర్ణయాలను ఆయా రాష్ట్రాలు బోర్డుకు ముందుగానే చెప్పాలి. ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చు, భద్రాతాపరమైన అంశాలు, అవసరమైన మరమ్మతులను పేర్కొనాలి. బోర్డుకు అవసరమైన అధికారులు, బడ్జెట్‌ను రాష్ట్రాలు చూసుకోవాలి. వరద పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, డ్యామ్‌ల భద్రత వంటి అంశాలను బోర్డు, రాష్ట్రాలు సంయుక్తంగా చూసుకోవాలి. వీటన్నింటికీ ముందు ఇరు రాష్ట్రాలు అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు, డ్యామ్ సేఫ్టీకి తీసుకున్న చర్యలు, గతంలో విపత్తు నిర్వహణ, కావాల్సిన నిధులకు సంబంధించిన అన్ని నివేదికలు సమర్పించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement