కొట్టేసినా.. కొనేవారు కరువు!  | Gold Thief Buyers are Drought! | Sakshi
Sakshi News home page

కొట్టేసినా.. కొనేవారు కరువు! 

Published Sun, Dec 2 2018 2:46 PM | Last Updated on Sun, Dec 2 2018 2:46 PM

Gold Thief Buyers are Drought! - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఓ టార్గెట్‌ను ఎంచుకుంటున్నారు... కొన్ని రోజుల పాటు పక్కాగా రెక్కీ నిర్వహిస్తున్నారు... ఆనక ఓ ‘మంచిరోజు’ పంజా విసురుతున్నారు... అత్యంత విలువైన వస్తువులే పట్టుకుపోతున్నారు... ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇలా కొట్టేసిన వాటిని ఎలా క్యాష్‌ చేసుకోవాలో తెలియక బుక్కైపోతున్నారు.

ఆ ప్రయత్నాల్లో ఉండగానే పోలీసులకు చిక్కేస్తున్నారు. ఇది ఆయా దొంగలకు ‘నిరాశ’ కలిగించే అంశమైనా... పోలీసులు మాత్రం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆ చోరీ సొత్తును సేల్‌ చేయడంలో చోరులు సఫలీకృతులై ఉంటే వారిని పట్టుకున్నా నష్టం తీర్చలేనిదయ్యేదని చెబుతున్నారు. గడిచిన రెండు నెలల్లోనే ఈ తరహాకు చెందిన ఉదంతాలు మూడు వెలుగులోకి వచ్చాయి.  


పాతబస్తీలోని పురానీహవేలీలో ఉన్న హిజ్‌ ఎగ్జాల్డెడ్‌ హైనెస్‌ (హెచ్‌ఈహెచ్‌) నిజాం మ్యూజియంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ 4 తెల్లవారుజామున భారీ చోరీ చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ముబిన్, మహ్మద్‌ గౌస్‌ పాషా దాదాపు 35 రోజుల పాటు రెక్కీలు, మార్కింగ్స్‌ తదితరాలు పూర్తి చేసుకున్నారు.

చివరకు సెప్టెంబర్‌ 4 తెల్లవారుజామున స్క్రూడ్రైవర్లు, కటింగ్‌ ప్లేయర్, మేకులు పీకే ఉపకరణం, తాడు, పది హాక్సా బ్లేడ్‌ల ‘సాయం’తో లోపలికి ప్రవేశించారు. అల్మారా పగులకొట్టి టిఫిన్‌ బాక్స్, కప్పుసాసర్, స్ఫూన్‌ తస్కరించి ఉడాయించారు. రాజేంద్రనగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌ సమీపంలో ఆ వస్తువులను పాతిపెట్టారు.

అంతకు ముందే వాటి ఫొటోలతో పాటు స్ఫూన్‌ తమ వద్ద ఉంచుకున్నారు. వీటితో విక్రేతల కోసం ముంబై వెల్లి ప్రత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరకు ఆ యత్నాల్లో ఉండగానే సెప్టెంబర్‌ 11న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు వస్తువులతో సహా చిక్కారు. ఆ టిఫిన్‌ బాక్స్‌లో నిజాం తిన్నారో తెలియదు కానీ...గౌస్‌మాత్రం బిర్యానీ భోంచేశాడు. అలాగేటీకప్పులో మొబిన్‌ మంచినీళ్లు తాగిసంతృప్తి చెందాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement