ప్రస్తుతానికి పనులు తాగునీటికే...
పాలమూరు’పై గ్రీన్ ట్రిబ్యునల్‌కు ప్రభుత్వం వివరణ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కింద ప్రస్తుతం కేవలం తాగునీటి అవసరాలకు సంబంధించిన పనులకు ప్రాధా న్యమిస్తూ వాటినే చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ (చెన్నై)కు వివరణ ఇచ్చింది. సాగునీటి పనులేవీ చేపట్టడం లేదని వెల్లడించింది. సాగునీటిని అందించే డిస్ట్రి బ్యూటరీ, కాలువల పనులను ఎక్కడా చేయ డం లేదని వివరించింది. పాలమూరు ప్రాజె క్టును మొదటి విడతలో తాగునీటికే పరిమితం చేస్తామని, తర్వాతనే సాగునీటికి విస్తరిస్తామ ని పేర్కొంది.
అందుకు సంబంధించి మార్చిన డిజైన్లను ఐదు రోజుల్లో సమర్పిస్తామంది. అటవీచట్ట నిబంధనలకు విరుద్ధంగా పాల మూరు ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపట్టిం దని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్ర వారం ట్రిబ్యునల్ విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహన్ పరాశరణ్... పిటిషనర్ తరఫున సంజయ్ ఉపాధ్యాయ్, రచనా రెడ్డి వాదనలు వినిపించారు.
అటవీ ప్రాంతంలో పనులు
సంజయ్ ఉపాధ్యాయ్ వాదిస్తూ ప్రాజెక్టు పనులు అటవీ ప్రాం తంలో జరుగుతున్నాయ ని, అక్కడ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం ఉందని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. ప్రాజెక్టు వల్ల వ్యన్య ప్రాణులకు ముప్పు వాటిల్లే అవకా శం ఉందన్నారు. పర్యావరణ అనుమతుల్లేకుం డానే దీన్ని చేపట్టారన్నారు. ఈ వాదనను మోహన్ పరాశరణ్ తోసిపుచ్చారు. టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పనులేవీ జరగట్లేదన్నారు. ప్యాకేజీ–1 పనులు అటవీ పరిధిలోకి వస్తాయ ని తెలిసిన వెంటనే పనులు నిలిపివేసి డిజైన్లు మార్చామన్నారు. ప్రాజెక్టు వల్ల 1,131 గ్రామా లకు, 50లక్షల మందికి తాగునీరు అందుతుం దన్నారు. దీనిపై ట్రిబ్యునల్ స్పందిస్తూ ప్రాజెక్టు డిజైన్‌ను చూస్తుంటే అలా అనిపించట్లేదని, అనుమతుల్లేకుండా ఎలా చేపట్టా రని ప్రశ్నించింది. వారం గడువిస్తే పూర్తిగా కొత్త స్కీమ్‌తో ట్రిబ్యునల్ ముందుకు వస్తామని పరిశరణ్ బదులిచ్చారు. దీంతో ట్రిబ్యునల్ తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
మార్పులున్న చోట కొత్త ఒప్పందాలు...
పాలమూరు ఎత్తిపోతల ప్యాకేజీ–1, 16ల్లో మార్పుచేర్పులకు ఇటీవల కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఇక్కడ మారిన మార్పులకు అనుగుణంగా పాత కాంట్రా క్టర్‌తో కొత్త ఒప్పందాలు చేసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.