పట్టభద్రుల పోరుకు గ్రీన్ సిగ్నల్ | Graduate War To the green signal | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల పోరుకు గ్రీన్ సిగ్నల్

Published Fri, Feb 20 2015 3:57 AM | Last Updated on Wed, Sep 5 2018 2:01 PM

పట్టభద్రుల పోరుకు గ్రీన్ సిగ్నల్ - Sakshi

పట్టభద్రుల పోరుకు గ్రీన్ సిగ్నల్

ఖమ్మం జెడ్పీసెంటర్: శాసన మండలి(ఎమ్మెల్సీ) పోరుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు గురువారం  నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి అక్కడ నోటిఫికేషన్ విడుదల చేశారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థాన ఎమ్మెల్సీ అభ్యర్థి పదవీ కాలం ముగియనుండడంతో ఎన్నికకు ఈ నెల 11వ తేదీన ఎన్నికల సంఘం షెడ్యుల్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలతో రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ విడుదల చేశారు.

దీనికి తోడు ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 16వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గెలుపొందిన అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 84 పోలింగ్ స్టేషన్‌లను గుర్తించారు. 500 మంది సిబ్బంది ఈ ఎన్నికల నిర్వహణలో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2011 అక్టోబర్ 31వ తేదీ వరకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులుగా ఉన్నారు. ఈ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారితో కలిపి నూతన ఓటర్ల జాబితను ఈ నెల 26వ తేదీన ప్రకటించనున్నారు. ఈ జాబితాలో పేరు ఉన్న పట్టభద్రులు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులు.  
 
పార్టీల ఎత్తులు.. పై ఎత్తులు....
పట్టభద్రుల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారుు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధ/ంచడంతో ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను సవాల్‌గా స్వీకరించి అభ్యర్థులను బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నారుు. టీఆర్‌ఎస్ మాత్రం గెలుపు ధీమాతో అడుగులు వేస్తోంది.  
 
అభ్యర్థుల ఎంపికలో తలమునకలు
ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో ఎత్తులు పై ఎత్తులు వేస్తూ దోబూచులాడుతున్నారుు. బీజేపీ అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్‌రావును ఆ పార్టీ ప్రకటించింది. దీంతో అతను ఇప్పటికే మూడు జిల్లాలో ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. ఇక టీఆర్‌ఎస్ విషయంలో ఇద్దరి మధ్య పోటీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క పార్టీ అధిష్టానం మాత్రం నల్లగొండకు చెందిన నరేందర్‌రెడ్డిని నిర్ణయించారనే ప్రచారం సాగుతోంది.

ఇక కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పలువురు ఆశావాహులు పోటీలో నిలిచేందుకు భారీగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన కొందరు అధికార పార్టీ తరుఫున పోటీ చేయూలని ఆసక్తి చూపుతున్నప్పటికీ అభ్యర్థి పేరు ఖరారైనట్లు ప్రచారం జరగడంతో ఆశావాహులు వెనుక్కు తగ్గినట్లు సమాచారం. ఇక వామపక్షాలు అభ్యర్థిని రంగంలోకి దింపుతాయూ.. లేక.. ఏ పార్టీకైనా మద్దతు ఇస్తాయూ..? అనే విషయం కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.
 
ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ ఇలా ....
     ఫ్రిబవరి 19న ఎన్నికల నోటిఫికేషన్
     26వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
     27వ తేదీన నామినేషన్ల  స్క్రూటినీ
     మార్చి 2వ తేదీన నామినేషన్ల  ఉపసంహరణ
     మార్చి 16వతేదీన ఉదయం 8గంటల నుం చి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు
     మార్చి 19వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌటింగ్
     మార్చి 23తో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.
 
అభ్యర్థులకు సూచనలు....
     పట్టభద్రుల స్థానం నుంచి బరిలో నిలిచే అభ్యర్థులు కొన్ని సూచనలు పాటించాలని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. బరిలో నిలిచే అభ్యర్థిగాని, అతడిని ప్రతిపాదించే వారు కాని ఈ నెల 26 ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో నల్లగొండ జిల్లా రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి(జిల్లా రెవెన్యూ అధికారి)కి నామినేషన్ పత్రాలు అందజేయూలని పేర్కొన్నారు.
     నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలు పొందవచ్చని పేర్కొన్నారు.
     నామినేషన్ పత్రాలను ఈ నెల 27వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు నల్లగొండ కలెక్టరేట్‌లో పరిశీలించనున్నట్లు తెలిపారు.
     అభ్యర్థిత్వం ఉపసంహరించుకొనే నోటిసును అభ్యర్థిచే, ప్రతిపాదించిన వ్యక్తి, ఏ జెంటు చేత రాత పూర్వకంగా ఎన్నికల అ ధికారి, సహాయ రిటర్నింగ్ అధికారికి మా ర్చి 2వ తేదీ సాయం6తం మూడు గంట లలోగా అందజేయూలని పేర్కొన్నారు.
 
ఖమ్మం నియోజకవర్గంలో 25వేల వరకు ఓట్లు
ఖమ్మం అర్బన్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేం దుకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 25 వేల మంది వరకు ఓటు హక్కు కలిగి ఉన్నట్లు ఖమ్మం అర్బన్ రెవెన్యూ అధికారు లు తెలిపారు. బుధవారం వరకు 24, 129 ఓట్లు ఉండగా గురువారం మరికొంత మంది నమోదు చేసుకున్నారని, వాటన్నిటితో కలి పితే సుమారు 25వేల వరకు ఉండవచ్చని అధికారి కరుణాకర్ తెలిపారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో మిగిలిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో అనేక మంది ఉద్యోగులు, పట్ట భద్రుల నివాసం ఉండటంతో వారంతా ఖమ్మం నియోజకవర్గంలో నమోదు చేసుకోవడంతో అత్యధికంగా ఖమ్మంలోనే ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement