గ్రీన్‌సిగ్నల్ 3జిల్లాలు | Green Signal 3 districts | Sakshi
Sakshi News home page

గ్రీన్‌సిగ్నల్ 3జిల్లాలు

Published Thu, Jun 9 2016 1:38 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM

గ్రీన్‌సిగ్నల్  3జిల్లాలు - Sakshi

గ్రీన్‌సిగ్నల్ 3జిల్లాలు

నియోజకవర్గాలు, మండలాల కూర్పుపై
అధికార యంత్రాంగం కసరత్తు
వికారాబాద్ జిల్లాలోకి కొడంగల్ నియోజక
వర్గం మొగ్గుకొన్ని మండలాలు
అటు.. ఇటు విభజన శాస్త్రీయంగా ఉండాలి
కలెక్టర్ల వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం

 
 
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాల విభజన ప్రక్రియకు ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టింది. విభజన పారదర్శకంగా, ప్రజలకు పరిపాలనాసౌలభ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జరిగిన కలెక్టర్ల వర్క్‌షాప్‌లో దిశానిర్దేశం చేశారు. జిల్లా మూడు జిల్లాలుగా విభజనకు దాదాపు రంగం సిద్ధమైంది. అయితే ఏయే నియోజకవర్గంలో ఏ మండలాన్ని చేర్చాలి.. ఆ నియోజకవర్గాన్ని ఏ జిల్లా కేంద్రం పరిధిలోకి తీసుకురావడం వల్ల ప్రజలకు పరిపాలన సౌలభ్యం అవుతుందన్న అంశంపై శాస్త్రీయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు 64 మండలాలుగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో 5 అర్బన్ మండలాలు, 5 రూరల్ మండలాలు అదనంగా రానున్నాయి.

వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేటతో పాటు ఆ పట్టణ ప్రాంతాలను ప్రత్యేక మండలాలుగా చేయనున్నారు. ఇక ప్రతి రెవెన్యూ డివిజన్‌లో కనీసం ఒక గ్రామాన్ని మండల కేంద్రంగా చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని మండలాల భౌగోళిక స్వరూపం సైతం కొంత మారే అవకాశం కనపడుతోంది. ఉదాహరణకు జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని మిడ్జిల్ మండలం నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోకి పంపించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గ పరిధికి చెందిన కొత్తకోట, అడ్డాకులను వనపర్తి జిల్లా పరిధిలోకి, దేవరకద్ర, భూత్పూర్, చిన్నచింతకుంటను మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోకి తేనున్నారు.


► ఇక కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటుచేయడం దాదాపు ఖరారైంది. ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాలతో కలిపి ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటుచేయాలని సమావేశంలో ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

► కొత్తగా ఏర్పడే వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఒక్కో జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
► మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం 6 నియోజకవర్గాలు ఉండే విధంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినా ఆ నియోజకవర్గ పరిధిలోని మండలాలు ఇతర జిల్లాలకు వెళ్లనున్నాయి.

► మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్‌ను వనపర్తి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు వచ్చాయి.
► కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మాడ్గుల్, ఆమన్‌గల్ మండలాలను ఇబ్రహీంపట్నం జిల్లాలో కలిపేందుకు ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తమైనట్లు తెలిసింది.

► మహబూబ్‌నగర్ జిల్లాకు సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని కుల్కచర్ల, దోమ, గండీడ్ మండలాలను తొలుత మహబూబ్‌నగర్‌జిల్లాలో కలపాలని భావించినా.. అక్కడి ప్రజలు విముఖత వ్యక్తం చేయడంతో వికారాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
 
కొడంగల్... రంగారెడ్డి జిల్లాలోకి ?
 
ఇక కొడంగల్ నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగించాలని భావించిన ఆ నియోజకవర్గ ప్రజలు అనేక మంది తమను రంగారెడ్డి జిల్లాలో కలపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు రావడంతో వారి అభిష్టం మేరకు వ్యవహరించాలని, మెజార్టీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని, బలవంతంగా ఏ ప్రాంతాన్ని మరో ప్రాంతంలో కలిపే ప్రయత్నం చేయొద్దని సీఎం జిల్లా అధికారులకు సూచించినట్లు తెలిసింది. భౌగోళికంగా రంగారెడ్డి జిల్లాకు అత్యంత సమీపంలో ఉండే కొడంగల్ నియోజకవర్గాన్ని రంగారెడ్డి జిల్లాలో కలిపే అంశాన్ని అక్కడి ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం తీవ్రంగా పరిశీలించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement