సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం హుషారుకు పన్ను పోటు తగిలింది. నూతన సంవత్సరం పేరిట నిర్వహించే కార్యక్రమాలన్నింటికీ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సిందేనని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సంవత్సర ఈవెంట్లను జీఎస్టీ చట్టం సెక్షన్ 25 (1) కింద రిజిస్టర్ చేసుకోవాలని.. 28 శాతం పన్ను చెల్లించేలా రిజిస్టర్ చేసుకున్నాకే ఈవెంట్లు జరుపుకోవాలని ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
రిజిస్టర్ చేసుకోలేని పక్షంలో ముందస్తు పన్ను చెల్లించి నిర్వహించుకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. పన్ను చెల్లించుకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే.. చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని జరిమానా రూపంలో వసూలు చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్ నాంపల్లిలోని పన్నుల శాఖ స్పెషల్ కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్) కార్యాలయం లేదా సంబంధింత సర్కిల్ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment