సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) హెచ్.ఎల్.దత్తు డిసెంబర్ 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టును సందర్శించనున్నారు.
విభజనపై న్యాయమూర్తులతో చర్చ..?
సాక్షి, హైదరాబాద్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) హెచ్.ఎల్.దత్తు డిసెంబర్ 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టును సందర్శించనున్నారు. ఇందులో భాగంగా ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా మిగిలిన న్యాయమూర్తులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. హైకోర్టు విభజనపై కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి ప్రధాన న్యాయమూర్తి డిసెంబర్ 5న రాత్రి 7.15 గంటలకు భార్యా సమేతంగా హైదరాబాద్ చేరుకుంటారు. 6వ తేదీ ఉదయం హైకోర్టును సందర్శిస్తారు. అదే రోజు సాయంత్రం తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళతారు.