సిరిసిల్ల : కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు స్వర్గం మహేశ్(45) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని బీవైనగర్‌కు చెందిన మహేశ్ పాలిస్టర్ మగ్గాలను నడిపించేవాడు. ఇటీవలే రూ. రెండు లక్షలు అప్పు చేసి ఇందిరమ్మ కాలనీలో ఇల్లు కట్టుకున్నాడు. భార్య గీత బీడీ కార్మికురాలు. పిల్లలు సాగర్, స్వాతి, శిరీష, హేమంత్ ఉన్నారు. కూతురు స్వాతి ఇంటర్‌తో చదువు ఆపివేసి బీడీలు చేస్తోంది. మహేశ్ ఎంత పని చేసినా పూట గడవడానికే సరిపోతుండడంతో అప్పు తీరే మార్గం కనిపించక వేకువ జామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.