అప్పుల బాధలకు తోడు కుటుంబ కలహాలు ఎక్కువవడంతో మనస్తాపం చెందిన నేతన్న కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సిరిసిల్ల(కరీంనగర్) : అప్పుల బాధలకు తోడు కుటుంబ కలహాలు ఎక్కువవడంతో మనస్తాపం చెందిన నేతన్న కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. సిరిసిల్లలోని బీవై నగర్‌కు చెందిన వెంగళరాజు(35) సాంచా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో సాంచా కార్మికులకు సరైన పనిలేకపోవడంతో అప్పులు ఎక్కవయ్యాయి.
దీనికి తోడు భార్యతో మనస్పర్థలు రావడంతో నెల రోజుల కిందటే భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన వెంగళరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.