వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా హరినారాయణ్ | Hari Narayan appointed as vikarabad sub collector | Sakshi
Sakshi News home page

వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా హరినారాయణ్

Published Thu, Jul 31 2014 12:05 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా హరినారాయణ్ - Sakshi

వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా హరినారాయణ్

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వికారాబాద్ సబ్‌కలెక్టర్ కాట ఆమ్రపాలి బదిలీ అయ్యారు. రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమశాఖ డెరైక్టర్‌గా ఆమెను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో హరినారాయణ్‌ను నియమించారు. 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు  చెందిన ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
 
నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన ఆయనకు ఇటీవల స్థానచలనం కలిగించినా పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో కొన్ని రోజులుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న హరినారాయణ్‌ను వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా నియమిస్తూ  తాజాగా ఉత్తర్వులిచ్చింది. దాదాపు రెండేళ్లు సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి సమర్థ అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ముక్కుసూటితనంతో పాలనా వ్యవ హారాల్లో దూకుడు ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement