
సాక్షి, హైదరాబాద్ : నగరంలో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్‌నగర్, మీర్‌పేట్, ఎల్బీ నగర్, ఖైరతాబాద్, బేగంపేట, హయత్‌నగర్, కోఠిలలో వర్షం పడుతోంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా కొన్ని చోట్ల రోడ్లు జలమయంగా మారాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.