యాదగిరిగుట్ట (నల్లగొండ) : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీకమాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి బారులు తీరారు. దర్శనానికి 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ఎక్కువవుతుండటంతో కొండపైకి వాహనాల అనుమతిని నిరాకరించారు.