జాయ్‌లో జర్క్
ఆహ్లాదంగా సాగుతున్న ‘జాయ్ రైడ్’ జర్కిచ్చింది. పర్యాటకులకు గగనయాన ఆనందాన్ని పంచుతున్న తుంబి ఏవియేషన్ హెలికాప్టర్ గురువారం పడబోయి పైకి లేచింది. మధ్యాహ్నం 1.15 గంటలకు పర్యాటకులతో టేకాఫ్ తీసుకుంది. అంతలోనే తడబడి సాగర్ వైపు దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఆందోళన చెందారు. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో భూమికి ఐదడుగుల ఎత్తులో కొద్దిసేపు గాల్లో నిలిచిపోయి.. తర్వాత పైకి ఎగిరింది. తిరిగొచ్చాక రైడ్‌ను రద్దుచేసి హెలికాప్టర్‌ను బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు.
రాంగోపాల్‌పేట్: పర్యాటకులకు హైదరాబాద్ నగరాన్ని చూపించేందుకు తుంబి ఏవియేషన్ ఏర్పాటు చేసిన జాయ్ రైడింగ్ హెలిక్యాప్టర్‌లో గురువారం మధ్యాహ్నం సాంకేతిక లోపం తలెత్తింది. పర్యాటకుల కోసం గురువారం నుంచి ఈనెల 15 వరకు జాయ్ రైడ్ తలపెట్టారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాట్లు చేశారు. దీనిద్వారా హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్ నగరం చూడవచ్చు. గురువారం ఉదయం 11 గంటలకు ఇది మొదలైంది.
నాలుగుసార్లు పర్యాటకులను తీసుకు వెళ్లి వచ్చిన హెలిక్యాప్టర్.. మధ్యాహ్నం 1.15 సమయంలో టేకాఫ్ తీసుకుంది ఆ సమయంలో 10 అడుగుల మేరకు పైకి ఎగిరి వెంటనే కిందికి దిగింది. భూమికి ఐదు అడుగుల ఎత్తులోనే పైలెట్ కొద్దిసేపు గాలిలో నిలిపి ఉంచాడు. తర్వాత మళ్లీ పైకి ఎగిరిరింది. రైడ్ నూర్తై.. ప్రయాణికులను దించిన సిబ్బంది మరో ట్రిప్ కోసం పర్యాటకులు వేచి చూస్తున్నా వారికి డబ్బు తిరిగిచ్చేసి హెలిక్యాప్టర్‌ను బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు తీసుకుతరలించారు. కాగా హెలిక్యాప్టర్‌లో ఎలాంటి సాంకేతిక సమస్య లేదని, శుక్రవారం జాయ్ రైడ్ ఉంటుందని తుంబి ఏవియేషన్ డైరెక్టర్ గోవింద్ నాయర్ తెలిపారు.