సాక్షి, హైదరాబాద్: యూనిటెక్ కంపెనీనుంచి తీసుకున్న రూ.162 కోట్లను తిరిగి ఆ కంపెనీకి చెల్లించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. యూనిటెక్‌కు కేటాయించిన భూమి తెలంగాణ భూభాగంపై ఉన్న నేపథ్యంలో ఆ కంపెనీ చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని తెలిపింది. ఏపీఐఐసీ–టీఎస్‌ఐఐసీల మధ్య ఆస్తి, అప్పుల విభజన వివాదాన్ని కారణంగా చూపుతూ యూనిటెక్ కంపెనీని ఇబ్బంది పెట్టడం సరికాదంది. యూనిటెక్ కంపెనీకి కేటాయించిన భూమి యాజమాన్యపు హక్కుల విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓడిపోయిందని, ఇప్పుడు ఆ కంపెనీకి ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వకుండా కుంటిసాకులు చెప్పడం భావ్యంకాదని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ముందు ఆ కంపెనీకి ఇవ్వాల్సిన రూ.162 కోట్లను వడ్డీతోసహా ఇచ్చేసి, ఆ తరువాత వాటా ఏదైనా రావాల్సి ఉంటే దానిని ఏపీ సర్కార్ (ఏపీఐఐసీ) నుంచి రాబట్టుకోవాలని, ఇరుప్రభుత్వాల మధ్య వివా దంలో యూనిటెక్‌ను లాగరాదని స్పష్టం చేసిం ది.
ఈ అంశంపై తుది తీర్పు వెలువరిస్తామంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచ ంద్రరావు గతవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో టౌన్‌షిప్ నిర్మాణం నిమిత్తం 164 ఎకరాలకు హెచ్‌ఎండీఏ అధికారులు 2008లో వేలం నిర్వహించారు. ఈ వేలంలో యూనిటెక్ కంపెనీ విజేతగా నిలిచింది. అత్యధికంగా ఎకరాకు రూ.4.20 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రూ.162 కోట్లను ప్రభుత్వానికి చెల్లించింది. అయితే ఈ భూమి యాజమాన్యపు హక్కులపై జరిగిన న్యాయ పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓడిపోయింది. దీంతో యూనిటెక్‌కు అప్పగించాల్సిన భూములపై ప్రభుత్వానికి హక్కు లేకుం డా పోయింది. యూనిటెక్ కంపెనీ సంస్థ చెల్లించిన రూ.162 కోట్లను మాత్రం ఇప్పటివరకు ఆ సంస ్థకు తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆ కంపెనీ తాము చెల్లించిన రూ.162 కోట్లను వడ్డీతోసహా చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
డబ్బు వాడుకుని సాకులు చెబుతారా?
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది (ఏఎస్‌జీ) ఎ.సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, రూ.162 కోట్లను వడ్డీతోసహా చెల్లించాలని యూనిటెక్ కోరుతోందని, వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ..వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని ఏ నిబంధనల్లో ఉందో చూపాలని కోరారు. యూనిటెక్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో వడ్డీతోసహా చెల్లించాలని స్పష్టంగా ఉందంటూ, సంబంధిత క్లాజును చదివి వినిపించారు.
యూనిటెక్ ఎందుకు బాధ్యత వహించాలి?
దీనికి సంజీవ్ స్పందిస్తూ, వడ్డీతో సంబంధం లేకుండా యూనిటెక్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తామని, అయితే దానిని ఏపీ పునర్విభజన చట్ట నిబంధనల ప్రకారం చెల్లిస్తామని తెలిపారు. ఏపీఐఐసీ–టీఎస్‌ఐఐసీల మధ్య ఆస్తి, అప్పుల విభజన జరగలేదని, అందువల్ల యూనిటెక్‌కు చెల్లించాల్సిన మొత్తంలో తాము 42 శాతం ఇస్తామని, మిగిలిన 58 శాతం ఏపీ ప్రభుత్వం చెల్లిం చాల్సి ఉంటుందని సంజీవ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై న్యాయమూర్తి విస్మ యం వ్యక్తం చేశారు. భూమి ఉన్నది తెలంగాణ భూభాగంపై, కాబట్టి ఆ కంపెనీకి చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయ భూమి మాకొద్దు
ఈ సమయంలో సంజీవ్ మరో ప్రతిపాదనను కూడా కోర్టు ముందుంచారు. యూనిటెక్‌కు మరోచోట భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా మన్నారు. ఈ ప్రతిపాదనను యూనిటెక్ తరఫు న హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశ్వినీకుమార్ వ్యతిరేకించారు. తమకు కావాల్సింది తమ డబ్బు మాత్రమేనని, మరేదీ అవసరం లేదన్నారు. దీంతో న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
రూ.162 కోట్లను యూనిటెక్‌కు చెల్లించండి
Published Wed, Oct 17 2018 1:15 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment