సెయింట్ ఆన్స్‌కు భూముల కేటాయింపుపై హైకోర్టు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: సెయింట్ ఆన్స్ విద్యాసంస్థలకు నామమాత్రపు ధరకు భూమిని కేటాయించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖరీదైన భూములను నామమాత్రపు ధరలకు కేటాయించడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సెయింట్‌ఆన్స్ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్‌బషీరాబాద్‌లో ఎకరా రూ.5 కోట్ల విలువ చేసే స్థలాన్ని సెయింట్ ఆన్స్ విద్యాసంస్థలకు ఎకరా రూ.ఐదు లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించిందని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో నష్టం చేకూరిందని, అందువల్ల ఈ కేటాయింపుల్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది ఎస్.మల్లారెడ్డి 2012లో హైకోర్టులో ప్రజాహితవ్యాజ్యం వేశారు. దీనిని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. మిషనరీ పాఠశాలలు ధార్మిక సంస్థలు కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విచారణను ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసింది.
ఇంత తక్కువ ధరకు భూములా?
Published Thu, Mar 27 2014 2:54 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement