25 ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: జేఎన్‌టీయూ హైదరాబాద్ పరిధిలోని 25 ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో ఊరట లభించింది. సరైన సౌకర్యాలు, అనుమతులు లేని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల గుర్తింపును రద్దు చేయాడాన్ని యాజమాన్యాలు హైకోర్టులో సవాలు చేశాయి. మంగళవారం హైకోర్టులో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ఊరట లభించింది.
జేఎన్‌టీయూ హైదరాబాద్ రద్దు చేసిన 25 ప్రైవేట్ కాలేజీలను ఈ దఫా కౌన్సెలింగ్‌కు అనుమతించాలని హైకోర్టు జేఎన్‌టీయూను ఆదేశించింది. మళ్లీ తనిఖీలు చేసి తుది నివేదిక అందజేయాలని హైకోర్టు జేఎన్‌టీయూకు తెలిపింది.