నాడు ద్రోహులు.. నేడు దోస్తులా: నాగం | how can you join tdp leaders in cabinet, nagam questions kcr | Sakshi

నాడు ద్రోహులు.. నేడు దోస్తులా: నాగం

Published Wed, Dec 17 2014 3:44 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

నాడు ద్రోహులు.. నేడు దోస్తులా: నాగం - Sakshi

నాడు ద్రోహులు.. నేడు దోస్తులా: నాగం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన తీరుపై బీజేపీ సీనియర్ నాయకుడు నాగం జనార్దనరెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన తీరుపై బీజేపీ సీనియర్ నాయకుడు నాగం జనార్దనరెడ్డి మండిపడ్డారు. టీ-టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ ద్రోహులని అభివర్ణించిన కేసీఆర్కు.. ఇప్పుడు వాళ్లు దోస్తులు ఎలా అయ్యారని నాగం ప్రశ్నించారు. ఏనాడూ తెలంగాణ జెండా పట్టనివాళ్లు, జై తెలంగాణ అనని వాళ్లు బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారని నిలదీశారు.

టీఆర్ఎస్లో మంత్రిపదవులు ఇవ్వడానికి సమర్థులైన ఎమ్మెల్యేలే లేరా అని అడిగారు. ఇతర పార్టీల వారిని చేర్చుకుని, మంత్రిపదవులు ఇవ్వడం తెలంగాణ ప్రజలను అవమానపర్చడమేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ కేసీఆర్ వల్ల సాధ్యం కావని నాగం జనార్దనరెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement