ఉపాధ్యాయులపై డీఈఓ ఆగ్రహం
పటాన్‌చెరు రూరల్ : జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో కూడా తెలియకుండానే విద్యార్థులకు విద్యాబోధన ఎలా చేస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని ముత్తంగి పాఠశాల సముదాయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 16 పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సమావేశాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారు. జిల్లా ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని ప్రశ్నించగా ఒక్క ఉపాధ్యాయులు కూడా సరైన సమాధానం చెప్పలేదు. ‘చర్చ’ అనే పదాన్ని బోర్డుపై రాయమంటే తప్పుగా రాశారు. విద్యార్థులకు ఒక్కసారి తప్పుడు పాఠాలు బోధిస్తే వారు కూడా అలాగే తయారవుతారన్నారు. విద్యార్థులకు చరిత్ర, కథలు చెప్పాలని సూచించారు.
సొంత బిడ్డలుగా భావించి విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఒక్కరోజుకు ఒక్క మార్కు సంపాదించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతే 100 రోజుల్లో విద్యార్థులు ఉత్తములుగా మారతారన్నారు. ఇప్పటికైనా ఉపాధ్యాయులు మారి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని డీఈఓ సూచించారు.
అసెంబ్లీ స్థానాల పేర్లు తెలియకుంటే ఎలా?
Published Thu, Dec 18 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement
Advertisement