గాంధీ, ఉస్మానియాల్లో హుండీలు | Hundis in the Osmania,Gandhi Hospital | Sakshi
Sakshi News home page

గాంధీ, ఉస్మానియాల్లో హుండీలు

Published Sat, Nov 12 2016 3:11 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

Hundis in the Osmania,Gandhi Hospital

సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో హుండీలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. పెద్ద మొత్తంలో నగదు, నల్ల ధనం ఉన్నవారు హుండీలో డబ్బులేయొచ్చని, ఆ వివరాలు గోప్యంగా ఉంచుతామని, సొమ్మును పేదల వైద్యానికి ఖర్చు చేస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

పెద్ద మొత్తంలో నగదు ఉన్న వారు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇబ్బందులు తప్పవని భావించే అవకాశముండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement