మంథని (కరీంనగర్): పెళ్లై ఏడాది కూడా కాకుండానే ఓ వివాహిత వరకట్న దాహానికి బలైంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మంథని మండల కేంద్రంలోని బ్రిడ్జిరోడ్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. జిల్లాలోని కమాన్‌పూర్ మండలం రొంపికుంటకు చెందిన శిరీష(22)కు మండల కేంద్రానికి చెందిన చంద్రమౌలి(25)తో ఏడాది కిందట వివాహమైంది.
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో చంద్రమౌలి కోపోద్రిక్తుడై శిరీష గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి నేరాన్ని అంగీకరించి స్టేషన్లో లొంగిపోయాడు. ఇదిలా ఉండగా.. మరోవైపు శిరీష తల్లిదండ్రులు మాత్రం పెళ్లైనప్పటి నుంచే అదనపు కట్నం కోసం వేదిస్తుండేవాడని, కట్నం కోసమే అల్లుడు చంద్రమౌలి తమ కూతురిని హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు.