
సాక్షి, హైదరాబాద్: మాల్దీవుల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆగ్నేయ దిశ నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఆది, సోమ, మంగళ వారాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. అలాగే రెండు రోజులుగా మెదక్ జిల్లాలో అత్యంత తక్కువ 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది
Comments
Please login to add a commentAdd a comment