
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు. సమ్మె కారణంగా హైదరాబాద్ వాసులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. హెచ్‌ఎంఆర్ అధికారులు మెట్రో సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు మెట్రో సర్వీసులను నడపనున్నట్టు తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.