
ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, మహబూబ్‌నగర్ : వెనుకబడిన, వలసల జిల్లా పాలమూరుకు తెలంగాణలో మొదటి మెడికల్ కళాశాల రావడం మనకు ఒక వరమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. గురువారం స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అంతుబట్టని రోగాలు పెరుగుతున్న ఈ సమయంలో డాక్టర్లు నిత్య విద్యార్థిగా పరిశోధనలు చేయాలని సూచించారు. పేదరికంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అలాగే, మెడికల కళాశాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేసి సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.