కరెంటు కోతలు లేని రాష్ర్టంగా తెలంగాణ | in telangana state 24 hours corrent supply | Sakshi
Sakshi News home page

కరెంటు కోతలు లేని రాష్ర్టంగా తెలంగాణ

Published Wed, Apr 20 2016 2:49 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

కరెంటు కోతలు లేని రాష్ర్టంగా తెలంగాణ - Sakshi

కరెంటు కోతలు లేని రాష్ర్టంగా తెలంగాణ

ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు
తేజావత్ రామచంద్రు
జైపూర్ ప్లాంట్‌లో పనుల పరిశీలన
ఎస్టీపీపీ సందర్శన

 
 జైపూర్  : తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకోవడం మూలంగానే ప్రస్తుత వేసవిలోనూ నిమిషం కరెంటు కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు తేజావ త్ రామచంద్రు తెలిపారు. జైపూర్‌లో సింగరేణి సం స్థ నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాం టును మంగళవారం ఆయన సందర్శించారు. పవర్‌ప్లాంటులోని మొదటి, రెండో యూనిట్ బాయిలర్ టర్బైన్ జనరేటర్(బీటీజీ) పనులు పరిశీలించారు.

ప్లాంటు పనుల పురోగతిపై ఎస్టీపీపీ జీఎం సుధాకర్‌రెడ్డితో మాట్లాడారు. నిర్మాణ పనుల ప్రగతి వివరాలను అడిగి తెలుకుసున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టణాల నుంచి మొదలుకు ని పల్లెల్లో కూడా నిరంతరం కరెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. మరికొద్ది రోజుల్లో జైపూర్ సింగరేణి ప్లాం టు ద్వారా మరో 1200 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తద్వారా మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. సింగరేణి అధికారుల కృషి అభినందనీయమని అన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్‌నాయక్, ఎస్టీపీపీ ఏజీఎం శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement