జాప్యంతో నెత్తిన భారం
సకాలంలో పూర్తికాక పెరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల భారం
ఉమ్మడి రాష్ట్రంలో తొలి, సవరించిన అంచనాల వ్యత్యాసం రూ. 57,554 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోందని వెల్లడించింది. సకాలంలో పనులు జరగక ఆశించిన ప్రయోజనాలు సైతం ఒనగూరడం లేదని స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు సీఎం స్థాయి లో సమావేశాలు జరిగినా పనుల్లో వేగం పెరగలేదని అభిప్రాయపడింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల్లో పనుల తొలి అంచనాలను సవరించి రూ. 57,554 కోట్లకు పెంచగా... అందులో ఒక్క తెలంగాణలోని ప్రాజెక్టుల్లో రూ. 37,327 కోట్ల మేరకు అంచనాలు పెంచినట్లు కాగ్ వెల్లడించింది. కాగ్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ప్రాజెక్టుల తొలి అంచనాలు 61,717.38 కోట్లుకాగా... సవరించిన వ్యయంతో అది రూ. 99.044 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇక 2013 నాటికి ప్రాజెక్టుల కోసం జరిగిన మొత్తం ఖర్చు రూ. 40,255.36 కోట్లుగా వెల్లడించింది.