- లబ్ధిదారుల వివరాలు కంప్యూటరీకరణ
- ఆధార్ సీడింగ్ తప్పని సరి
- హౌసింగ్ ఈఈ శంకరయ్య
ధర్పల్లి : జిల్లాలో ఇందిరమ్మ పథకం కింద 4,706 మంది లబ్ధిదారులకు రూ. 14 కోట్ల బిల్లులు బాకాయిలు ఉన్నాయని నిజామాబాద్ డివిజన్ హౌసింగ్ ఈఈ శంకరయ్య తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మండల హౌసింగ్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెందిన ఆధార్ సీడింగ్ డాటాను పరిశీలించారు. మండల హౌసింగ్ ఏఈ గంగాధర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బకాయి బిల్లులను విడుదల చేశారన్నారు.
అవీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల వివిధ స్కీమ్‌ల కింద ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 1.58లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయని మిగితా 1.92లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఇందులో ఇప్పటి వరకు 83 వేల ఇళ్లు నిర్మాణాలు చేపట్టలేదన్నారు. మార్చి-2014 నుంచి ఆరు నెలల పాటు హౌసింగ్ బిల్లులు నిలిచి పోయాయన్నారు. ఎన్నికల సందర్భంగా లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగిందన్నారు. నిర్మాణం దశలో ఉన్న ఇళ్లను మండల స్థాయిలో ఈఈలు, గ్రామ స్థాయిలో డీఈలు పరిశీలిస్తున్నారన్నారు. ఎక్కడ బోగస్ లేకుండా తనిఖీలను చేపట్టుతున్నామన్నారు. నిజమైన ఇంటి నిర్మాణాలకు బిల్లులు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
లబ్ధిదారుల వివరాలు కంప్యూటరీకరణ
హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి వివిధ స్కీమ్స్ కింద లబ్ధిపొందిన వారి వివరాలను కంప్యూటరీకరణ చేపట్టుతున్నట్లు ఈఈ తెలిపారు. 1983 నుంచి ఇప్పటి వరకు ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారుల వివరాలు అందులో ఉంటాయన్నారు. 30 ఏళ్లలో వివిధ స్కీమ్స్‌ల కింద పొందిన లబ్ధిదారుల గుర్తింపు చేసి కంప్యూటరీకరణ చేస్తామన్నారు. అలాగే ప్రతి లబ్ధిదారుడి ఆధార్ సీడింగ్ తప్పని సరి చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 72 శాతం కంప్యూటరీకరణ పూర్తి అయ్యిందన్నారు.
గుగుల్ మ్యాప్స్‌తో ఇళ్ల గుర్తింపు
జిల్లాలో 36 మండలాల్లో ఒక్కో మండలంలోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి గుగుల్ మ్యాప్స్ ఆధారంగా ఇళ్ల నిర్మాణాలను గుర్తించే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని అన్సాన్‌పల్లి గ్రామాన్ని గుగుల్ ఆధారం గ్రామ ఇళ్ల సముదాయం గుర్తించేలా మ్యాప్ తయారు చేశామన్నారు. దీని ఆధారంగా గ్రామంలో హౌసింగ్ బృందం తనిఖీ చేసి ఏఏ ఇళ్లు ఎన్ని ఉన్నాయో పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేస్తామన్నారు. నివేదికను హౌసింగ్ ఎండీకి అందిస్తామన్నారు. దీని వల్ల హౌసింగ్ శాఖలో అవినీతి బయట పడుతుందన్నారు. సీబీ సీఐడీలు తనిఖీలు చేస్తే సులువుగా ఉండేలా లబ్ధిదారుల నివేదికలు తయారు చేస్తున్నామన్నారు.
83 వేల ఇళ్ల జాబితాను ప్రభుత్వానికి పంపించాం
జిల్లాలో ఇటీవల హౌసింగ్ కింద మంజూరైన 83 వేల ఇళ్ల నివేదికలను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కింద వీరికి ఇళ్ల మంజూరు ఉంటుందన్నారు. ప్రస్తతం అవీ రద్ధయినట్లేనన్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఆధారంగానే ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇళ్ల మంజూరు పక్కాగా చేపడతామన్నారు.
రూ. 14 కోట్ల ఇందిరమ్మ బకాయిలు
Published Thu, Oct 9 2014 3:58 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement