సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాపై నిఘా పెట్టిన సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు దొంగల ముఠా ఆట కట్టించారు.
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దృష్టి మరల్చి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాపై నిఘా పెట్టిన సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు వారి ఆట కట్టించారు. అటు పోలీసులకు ఇటు ప్రజలకు కంటిమీద కులుకు లేకుండా చేస్తున్న ఈ ముఠా ఆట కట్టించేందుకు పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న చెన్నైకు చెందిన ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.