
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 31 జిల్లాల్లోని ప్రభుత్వ విభాగాల సమగ్ర వివరాలతో కూడిన ‘వార్షిక గణాంక దర్శిని– 2017’ను సీఎం కేసీఆర్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ బుధవారం ఆవిష్కరించారు. బేగంపేటలోని ప్రగతి భవన్‌లో రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రమేశ్ చంద్‌లతో కేసీఆర్ సమావేశమయ్యారు.
రాష్ట్రంలోని కొత్త కార్యక్రమాలు మినహాయించి జాతీయ అభివృద్ధి విషయాలపై చర్చించారు.28 అంశాలతో ప్రచురించిన వార్షిక గణాంక దర్శినిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రణాళిక విభాగ వైస్ చైర్మన్ ఎస్ నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఏకే గోయల్, జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, బీపీ ఆచార్య, నీతి ఆయోగ్ సలహాదారు అశోక్ జైన్ తదితరులు పాల్గొన్నారు.