జీవో 3పై విచారణ 12 కు వాయిదా | investigation postponed to August 12 on GO- 3 issue | Sakshi
Sakshi News home page

జీవో 3పై విచారణ 12 కు వాయిదా

Published Wed, Aug 6 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

investigation postponed to August 12 on GO- 3 issue

సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రయోజనాల నిమిత్తమే తాము వాహనాల రిజస్ట్రేషన్ల నంబర్ మార్పిడి జీవో 3 జారీ చేశామని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి మంగళవారం హైకోర్టుకు నివేదించారు. రిజిస్ట్రేషన్ల నంబర్ల మార్పిడిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అభ్యంతరాలు స్వీకరించేందుకు ఆ జీవో జారీ చేశామన్నారు. గడువిస్తే కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం అంగీకరించి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఆంధ్రప్రదేశ్ (ఏపీ) పేరుతో ఉన్న వాహనాల నంబర్ ప్లేట్లను తెలంగాణ రాష్ట్రం (టీఎస్)కి మార్చుకోవాలన్న ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం జూన్ 17న జారీ చేసిన జీవో 3 ను సవాలుచేస్తూ జె.రామ్మోహన్ చౌదరి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement