వచ్చే వార్షిక బడ్జెట్ కోసం నీటిపారుదల శాఖ పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు వాటిని ఆర్థిక శాఖకు అందజేసింది.
ఆర్థిక శాఖకు నీటిపారుదల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వార్షిక బడ్జెట్ కోసం నీటిపారుదల శాఖ పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు వాటిని ఆర్థిక శాఖకు అందజేసింది. సాగునీటి ప్రాజెక్టు పనులు, చిన్ననీటి వనరుల పునరుద్ధరణకు రూ.17,500 కోట్లు అవసరమని నీటి పారుదలశాఖ అంచనా ప్రతి పాదనలను సిద్ధం చేసి ఆర్థికశాఖకు సమర్పిం చింది. ఇందులో కొత్తగా రూ.14,350 కోట్ల అంచ నాలతో చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ.1500 కోట్లు, ప్రాణహిత-చేవెళ్లకు రూ.4850 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించింది.
మిషన్ కాకతీయకు రూ.3500 కోట్ల విలువైన ప్రతిపాదనలు అందజేసింది. బడ్జెట్ కసరత్తులో భాగంగా శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తూ ప్రతిపాదనలు సేకరిస్తున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతలు, అవసరమయ్యే నిధులపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు నాగార్జునసాగర్ ఆధునికీకరణకు రూ.300 కోట్లు, ఎస్‌ఎల్‌బీసీ సొరంగానికి రూ.932 కోట్లు, ఎస్సారెస్పీ ఆధునికీకరణకు రూ.135 కోట్లు, దేవాదులకు రూ.650 కోట్లు, కంతానపల్లికి రూ.500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించినట్లుగా తెలిసింది. ఖమ్మం జిల్లాలోని శ్రీరాంసాగర్ రెండోదశ, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ఎత్తిపోతలు, ఇచ్చంపల్లి, కిన్నెరసాని ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, అఖిపక్షనేతలు మంత్రులు ఈటెల, హరీశ్‌రావులను కోరారు.