
బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బిగాల తదితరులు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరం లో ఐటీ హబ్ నిర్మాణానికి నేడు తొలి అడుగు పడనుంది. ఐటీ హబ్‌తో పాటు, ఇంక్యూబేషన్ సెం టర్‌కు రూ.50 కోట్లను ఇప్పటికే మంజూరు చేసిన ప్రభుత్వం వీటి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ ప్రాంతం దుబ్బ బైపాస్ రోడ్డులోనే ఐటీ హబ్‌ను నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం హబ్‌కు శంకు స్థాపన చేయనున్నారు.
కేటీఆర్ పర్యటన సందర్భంగా నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించా లని నిర్ణయించారు. పాలిటెక్నిక్ మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభను విజయవం తం చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. బహిరంగ uమొదటిపేజీ తరువాయి
సభ వేదికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వర్షం కురిసినా సభకు హాజరైన ప్రజలు తడవకుండా రేకులతో భారీ షెడ్‌ను నిర్మించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త రెండు రోజులుగా ఈ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
కేటీఆర్ పర్యటన ఇలా..
మంత్రి కేటీఆర్ రోడ్డు మార్గం ద్వారా ఉదయం 11.30 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుంటారు. మాధవనగర్ సమీపంలోని బృందావనం గార్డెన్ నుండి ర్యాలీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.15 గంటలకు బైపాస్ రోడ్డులోని కొత్త కలెక్టరేట్ సమీపంలో ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేస్తారు. మధ్యా హ్నం 12.30 గంటలకు కంఠేశ్వ ర్‌లోని పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో ఏ ర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు మున్సిపల్ కా ర్యాలయానికి చేరుకుంటారు. నగరంలో రూ.300 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా చెట్టు నాటుతారు. శానిటేషన్‌కు సంబంధించి కొత్త వాహనాలను ప్రారంభిస్తారు. తర్వాత మధ్యా హ్నం 2.50 గంటలకు పూలాంగ్ చౌరస్తాలో రూ. 98 కోట్లతో అమృత్ పథకం ఫైలాన్‌ను ఆవిష్కరిస్తారు.
అక్కడి నుంచి నాగారంలో నిర్మిస్తున్న డబు ల్‌బెడ్‌రూం ఇళ్లను పరిశీలిస్తారు. అక్కడే మరో వెయ్యి ఇండ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.20 నిమిషాలకు సుభాష్‌నగర్‌లోని నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
మధ్యా హ్నం 3.30 గంటలకు చంద్రశేఖర్‌కాలనీలో బైపాస్ రోడ్డు పక్కన టీఎన్‌జీవోఎస్ ఆధ్వర్యంలో చేపట్టే హరితహారంలో పాల్గొంటారు. సాయంత్రం 4.00 గంటలకు ఓ ప్రైవేటు కాలేజీలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం 4.30 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళుతారు.
Comments
Please login to add a commentAdd a comment