తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడ్డారని, ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ..
ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడ్డారని, ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త ఆర్.ఎస్.నరోత్తం మంగళవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐతో విచారణ జరిపించి అవినీతి నిరోధక చట్టం, ఇతర చట్టాల ద్వారా ఆయనను శిక్షించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. పొన్నాల లక్ష్మయ్యను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.