
సాక్షి, హైదరాబాద్ : నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం చెన్నారం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కొండమల్లెపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఘటన తనను ఎంతగానో కలిచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదానికి కారకులైన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలు మనోధైర్యం కోల్పోవద్దని పేర్కొన్నారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. (ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!)
హైదరాబాద్ నుంచి దేవరకొండవైపు వస్తున్న టాటాఏస్ వాహనం నాగార్జున సాగర్ హైవేపై కొండమల్లెపల్లి మండలం చెన్నారం వద్దకు రాగానే టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలోఎనిమిది మంది మృతి చెందగా.. 10 మందికి తీవ్రగాయలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment