రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరాం
లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే పక్షంలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నామని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత జితేందర్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొద్దిరోజుల్లో మొదలవనున్న నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హెచ్‌సీయూ, జేఎన్‌యూ సమస్యలను పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే పరిష్కరించాలని సమావేశంలో సూచించామన్నారు. ‘‘రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వెనుకబడిన ప్రాంతాల నిధులు, ఎయిమ్స్ ఏర్పా టు తదితర అంశాలను చర్చించాలని.. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలని కోరాం. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపు ప్రక్రియను ఈ సమావేశాల నుంచే ప్రారంభించాలని కోరాం...’’ అని జితేందర్‌రెడ్డి చెప్పారు.