ఆసిఫాబాద్: జిల్లాలో ఏళ్ల తరబడి సిబ్బంది ఖాళీలతో అరకొరగా ఉన్న అంగన్‌వాడీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. నియామకాల కోసం ప్రకటన విడుదల చేసింది. దీంతో జిల్లా పరిధిలోని స్థానిక మహిళలకు ఇటు ఉద్యోగంతో పాటు, అటు గ్రామీణ ప్రాంతా ల్లోని అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు సేవలు మరింత పకడ్బందీగా అందనున్నాయి.
గతంలో జిల్లా ఎంపిక కమిటీలో ప్రజాప్రతినిధులు ఉండగా ప్రస్తుతం పూర్తిగా అధికార యంత్రాంగమే ఉండనుంది.అంతేకాక ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్‌లోనే జరగనుంది. జిల్లాలో మొత్తం 834 అంగన్‌వాడీ కేంద్రాలు, 139 మినీ అంగన్‌వాడీలు ఉన్నాయి. వీటి పరిధిలో అంగన్‌వాడీలు, మినీ అంగన్‌వాడీలు, హెల్పర్స్ విభాగాల్లో మొత్తం 231 పోస్టులు భర్తీ కానున్నాయి.
అర్హతలు
దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పని సరిగా స్థానికంగా నివసించే వారు అయి ఉండాలి. పదోతరగతి ఉత్తీర్ణత కలిగి uమొదటిపేజీ తరువాయి
ఉండాలి. వయస్సు 18 నుంచి 35 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన వాటికి వారే అర్హులు. ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక అభ్యర్థులే అర్హులు. పాక్షికంగా వినికిడి శక్తి ఉన్న వారు, ఇతరుల సాయం లేకుండా విధులు నిర్వహించగలిగేవారు దివ్యాంగులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అంతా ఆన్‌లైన్‌లోనే
ఈ పోస్టుల భర్తీ అంతా ఆన్‌లైన్‌లోనే జరగనుంది. మొదట అభ్యర్థులు జ్టి్ట వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో సమర్పించాలి. దరఖాస్తు చేసిన అభ్యర్థినీల ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 17 నుంచి 24 మధ్య జరుగుతుంది. ఇందులో నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం స్థానికత, పుట్టిన తేది, విద్యార్హత, కుల, ఆదాయ, ఆధార్ తదితర అన్ని సర్టిఫికెట్లు సరిగా ఉన్నవి లేనివి జిల్లా శిశు సంక్షేమ అధికారులు పరిశీలిస్తారు.
ఒక వేళ ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు, అభ్యర్థినీల వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలకు తేడా ఉంటే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. అనంతరం పరిశీలించిన దరఖాస్తులను ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అప్పుడు అర్హుల తుది జాబితా ఆన్‌లైన్‌లో సిద్ధమవుతుంది.
ఎంపికకు జిల్లా కమిటీ
గతంలో స్థానిక ప్రజాప్రతినిధులకు జిల్లా సెలెక్షన్ కమిటీలో స్థానం ఉండగా ప్రస్తుతం అంతా అధికారులే ఉండనున్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, ఐటీడీఏ పరి«ధిలోని అంగన్‌వాడీలకు పీవో, సభ్యులుగా జిల్లా వైద్యాధికారి, జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి, సంబంధిత ప్రాజెక్టు పరిధిలోని ఆర్డీవో ఉంటారు. ఆన్‌లైన్‌లో తుది జాబితా ప్రకారం ముందుగానే ప్రకటించిన తేది మేరకు ఈ కమిటీ నేతృత్వంలో నియామకాల కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయి.
అర్హులందరి పదో తరగతిలో సాధించిన మార్కులను ప్రాతిపదికన తీసుకుంటారు. రిజర్వేషన్లు ప్రకారం ఎంపిక ఉంటుంది. ఒకే అంగన్‌వాడీ కేంద్రంలో ఇద్దరు అభ్యర్థినీలకు ఒకే కులం, సమ మార్కులు వస్తే వయస్సును పరిగణలోకి తీసుకుంటారు. అంటే వయస్సు అధికంగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపిక అయిన అభ్యర్థుల వివరాలు అన్ని అంగన్‌వాడీ ప్రాజెక్టు ఆఫీసు, కలెక్టరేట్, జిల్లా ఐసీడీఎస్ పీడీ కార్యాలయం నందు అందుబాటులో ఉంచుతారు.
Comments
Please login to add a commentAdd a comment