నల్లగొండ లీగల్: రాష్ట్రంలో పెరుగుతున్న కేసులకు అనుగుణంగా కోర్టుల సంఖ్యను పెం చుతున్నట్లు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం నల్లగొండలోని బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. జూనియర్ న్యాయవాదులు నిరంతరం అధ్య యనం చేస్తూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. భూ సేకరణ కేసుల పరిష్కారానికి త్వరలో జరగనున్న జాతీయ లోక్ అదాలత్ వేదిక కానుందని తెలిపారు. న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా విస్తృతంగా ప్రజలకు న్యాయ సహాయం అందించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment