
కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ హరీష్‌తో నూతన కార్యవర్గం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్‌జీఓ) యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా నాలుగోసారి కె.లక్ష్మణ్ ఎన్నికయ్యారు. టీఎన్‌జీఓ జిల్లా కార్యవర్గ ఎన్నికలు సోమవారం ఎన్నికల అధికారి రామ్మోహన్, సహాయ ఎన్నికల అధికారి వీవీ నర్సింహారావు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సెక్రటరీగా బి.బుచ్చిరెడ్డి ఎన్నియ్యారు. మూడేళ్ల పాటు ఈ కార్యవర్గం కొనసాగుతుంది. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా సలీంమియా, ఉపాధ్యక్షుడిగా బి.ఆనంద్‌సింగ్, జె.బుచ్చయ్య, ఎస్.ఎంజుల, జాయింట్ సెక్రటరీలుగా జి.శేఖర్ రెడ్డి, బి.మాణిక్యరెడ్డి, సీహెచ్.అమరావతి, కోశాధికారిగా పి.విజయ్‌కుమార్, ఆఫీస్ సెక్రటరీగా కె.చంద్రశేఖర్, స్పోర్ట్స్ సెక్రటరీగా జె.జశ్వాంత్ నా యుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.రాజేశ్వర్ రె డ్డి, పబ్లిసిటీ సెక్రటరీగా ఆర్.రంగయ్య, సభ్యులు గా వి.రాములు, బి,మాధవ్ గౌడ్, ఎం.రవి, ఇంద్రసేనా రెడ్డి ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం కలెక్టర్ రఘునందన్‌రావును, జాయింట్ కలెక్టర్ హరీష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి కలెక్టర్, జేసీ అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment