'న్యాయమైన వాటా దక్కేవరకూ పోరాటం' | Kadiyam Srihari slams central government over krishna river water dispute | Sakshi
Sakshi News home page

'న్యాయమైన వాటా దక్కేవరకూ పోరాటం'

Published Wed, Dec 9 2015 1:54 PM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

Kadiyam Srihari slams central government over krishna river water dispute

వరంగల్ : కృష్ణా జలాల పంపిణీలో కేంద్ర నిర్ణయం తెలంగాణకు ద్రోహం చేసేలా ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. వరంగల్లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కేవరకూ పోరాటం చేస్తామని కడియం స్పష్టం చేశారు. రాష్ట్ర వాటా కోసం కేంద్రంపై రాజకీయ, న్యాయపోరాటం చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పోరుకు ప్రతిపక్షాలు సహకరించాలని కడియం కోరారు.  కృష్ణా జలాల్లో అన్యాయంపై తెలంగాణ టీడీపీ, బీజేపీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement