
గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం
ప్రజా కవి కాళోజీ నారాయణరావు పురస్కారం-2016కుకవి, గాయకుడు గోరటి వెంకన్న ఎంపికయ్యారు.
సాక్షి, హైదరాబాద్: ప్రజా కవి కాళోజీ నారాయణరావు పురస్కారం-2016కుకవి, గాయకుడు గోరటి వెంకన్న ఎంపికయ్యారు.
ఈ మేరకు నియమించిన కమిటీ సిఫారసు చేయగా.. దానికి సర్కారు ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురస్కారం కింద రూ.లక్షా వేయి నూట పదహార్లు నగదు అందజేస్తారు. కాళోజీ జయంతి వేడుకల్లో పురస్కారం ప్రదానం చేస్తారు.