సాక్షి, హైదరాబాద్: అవసరమైనచోట ఈ నెల 11వ తేదీ నుంచి కంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 95 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయాలని నిర్ణయించినట్లు ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసార«థి తెలిపారు. ‘కందుల ధర ఢమాల్’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు పార్థసారథి నేతృత్వంలో సోమవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి నాఫెడ్, మార్క్‌ఫెడ్, హాకా తదితర సంస్థల అధికారులు హాజర య్యారు. సమావేశం నిర్ణయాలను పార్థ సారథి ఒక ప్రకటనలో వెల్లడించారు. మార్కెట్‌లో కంది కనీస మద్ధతు ధర రూ. 5,450 కన్నా తక్కువగా ఉన్నందున ఈ విషయమై చర్చించామని పేర్కొన్నారు. కందుల ఉత్పత్తి ఈసారి 1.65 మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా వేసినందున అందుకు తగినట్లు 95 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. హాకా ఆధ్వర్యంలో సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, సూర్యా పేట్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుందన్నారు.
మిగి లిన 23 జిల్లాలలో మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీగా నాఫెడ్ ఉంటుందని పేర్కొన్నారు. రైతులు 12% తేమ మించ కుండా కందులను తీసుకొని వచ్చేవిధంగా ఆయా మార్కెట్ యార్డుల తరపున అవ సరమైన ప్రచారాన్ని, అవగాహనను కల్పిం చాలని సూచించారు. శుభ్రపర్చే యంత్రా లను రైతులకు సరిపడా చేకూర్చాలన్నారు. సోయాబీన్ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు తగ్గినందున వారం రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేద్దామని అధికారులు పార్థసారథికి వివరించారు. మినుముల సేకరణ నాలుగు రోజుల్లో ముగుస్తుందని ఆయనకు వివ రించారు. సమీక్షలో వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి.లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment