Kandi
-
ఇనుప బట్టీలతో బయోచార్ : బెట్ట నుంచి రక్షణ, 15శాతం అదనపు పంట!
పంట కోతలు పూర్తయ్యాక పత్తి, కంది, సోయా తదితర పంటల కట్టెకు నిప్పుపెట్టి పర్యావరణానికి హాని చేసే కన్నా.. ఆ కట్టెతో కట్టె బొగ్గు (బయోచార్) తయారు చేసి, తిరిగి భూములను సారవంతం చేసుకోవచ్చు. ఎకరానికి టన్ను బయోచార్ కం΄ోస్టు వాడితే పంటలు బెట్టను తట్టుకుంటాయి. తద్వారా పంట దిగుబడులను 12–15% వరకు పెంచుకోవచ్చని మహారాష్ట్రలో ఓ రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనుభవం చాటి చెబుతోంది..పంట వ్యర్థాలను తగులబెట్టటం పరిపాటి. ఇది పర్యావరణానికి హాని చేసే పని. పత్తి కట్టె, కంది కట్టె వంటి పంట వ్యర్థాలను కాలబెట్టటం వల్ల గాలి కలుషితమై కార్బన్డయాక్సయిడ్ శాతం పెరిగిపోతంది. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. రసాయనిక ఎరువుల వాడకం పెరిగిపోయింది. ఫలితంగా సాగుభూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయింది. మట్టికి నీటిని పట్టి ఉంచే శక్తి లోపించటం, వాన నీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం తగ్గి΄ోవటం, సూక్ష్మజీవరాశి నశించటం వల్ల భూములు నిస్సారమైపోతున్నాయి. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో 4 లక్షల హెక్టార్లలో పత్తి, లక్ష హెక్టార్లలో కంది పంటలను రైతు సాగు చేస్తారు. పంట కోత పూర్తయిన తర్వాత రైతులు పత్తి, కంది కట్టెను కాల్చివేస్తారు. దీని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా భూమికి తిరిగి అందాల్సిన సేంద్రియ పదార్థం అందకుండా పోతోంది. బిఎఐఎఫ్ (బైఫ్) డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే పుణేకు చెందిన స్వచ్ఛంద సంస్థ యవత్మాల్ రైతులతో కలసి పనిచేసి ఈ పరిస్థితిలో విజయవంతంగా మార్పుతెచ్చింది. పత్తి, కంది కట్టెను వట్టిగా కాలబెట్టకుండా.. ఒక పద్ధతి ప్రకారం (దీన్నే పైరోలిసిస్ అంటారు) కాల్చితే బొగ్గుగా మారుతుంది. దీన్నే బయోచార్ అంటారు. దీన్ని సేంద్రియ ఎరువులతో కలిపి బయోచార్ కంపోస్టుగా మార్చి భూమిలో చల్లితే మట్టిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంతతి పెరిగి భూసారం మెరుగవుతుంది. బయోచార్ కంపోస్టు వాడకం వల్ల ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ నేలలకు బెట్టను తట్టుకునే శక్తిని పెంపొందిస్తాయి. బయోచార్ కంపోస్టు తయారు చేయాలంటే.. బయోచార్ను ఉత్పత్తి చేసే ఇనుప బట్టీని ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత చిన్న రైతులకు విడిగా ఉండదు. అందుకని బైఫ్ ఫౌండేషన్ రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్.పి.ఓ.ని) 2019లో రిజిస్టర్ చేయించింది. 220 మంది రైతులను కూడగట్టి ఒక్కొక్క రైతు నుంచి రూ. వెయ్యి షేర్ ధనంతో ఎఫ్.పి.ఓ.ను రిజిస్టర్ చేయించారు. పత్తి, కంది కట్టెను కాల్చవద్దని, దీనితో ఎఫ్పిఓ తరఫున బయోచార్ తయారు చేసుకొని పంటలకు వాడుకుంటే బెట్టను తట్టుకొని మంచి దిగుబడులు పొందవచ్చని బైఫ్ ఫౌండేషన్ సిబ్బంది రైతులకు ఆలోచన కలిగించారు. 2021 జనవరిలో ఎఫ్పిఓ పత్తి కట్టెను రైతుల నుంచి కిలో రూ. 2.5–3లు చెల్లించి కొనుగోలు చేసింది. రూ. 60 వేల ఖర్చుతో బ్యాచ్‌కు 200 కిలోల కట్టెను కాల్చే ఇనుప బట్టీని ఎఫ్పిఓ కొనుగోలు చేసింది. ఈ బట్టీ ద్వారా పైరోలిసిస్ పద్ధతిలో ఈ కట్టెను కాల్చి బొగ్గును తయారు చేసింది. బొగ్గును పొడిగా మార్చి గోనె సంచుల్లో నింపి ఎఫ్పిఓ తిరిగి రైతులకే అమ్మింది. మార్కెట్ ధర కన్నా కిలోకి రూ. 2, 3 తగ్గించి అమ్మింది. 2021–22లో ఎఫ్పిఓ విజయవంతంగా 100 టన్నుల పత్తి కట్టెతో 25 టన్నుల బయోచార్ను ఉత్పత్తి చేయగలిగింది. ఎఫ్పిఓ బయోచార్ ఉత్పత్తిని చేపట్టటం వల్ల చాలా మందికి పని దొరికింది. కాల్చేసే పత్తి కట్టెను రైతు అమ్ముకొని ఆదాయం పొందాడు. కట్టెను సేకరించటంలో కూలీలకు పని దొరికింది. వాహనదారులకు కట్టెను బట్టీ దగ్గరకు చేర్చే పని దొరికింది. చివరికి బయోచార్ను రైతులే తిరిగి తక్కువ ధరకు కొనుక్కోగలిగారు. అంతిమంగా కాలబెడితే ఆవిరైపోయే పత్తి కట్టె.. ఎఫ్పిఓ పుణ్యాన భూమిని సుదీర్ఘకాలం పాటు సారవంతం చేసే బయోచార్గా మారి తిరిగి ఆ పొలాలకే చేరటం విశేషం. హెక్టారుకు 2.5 టన్నుల బయోచార్ కంపోస్టును దుక్కిలో వేశారు. ఏటేటా పంట దిగుబడులు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా భూముల్లో నుంచి ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల మట్టి వాన నీటితో పాటు కొట్టుకు΄ోతోంది. ప్రపంచ భూభాగంలో భారత్ వాటా 2.2% మాత్రమే. అయితే, ప్రపంచం ఏటా కోల్పోతున్న మట్టిలో 23%ని, హెక్టారుకు సగటున 16% టన్నుల మట్టిని మన దేశం కోల్పోతున్నదని ఎఫ్.పి.ఓ. చెబుతున్న లెక్క. అయితే, ఢిల్లీ ఐఐటిలోని పరిశోధకుల బృందం ‘సాయిల్ ఎమర్జెన్సీ’ గురించి తాజా అధ్యయనం విస్తుగొలిపే గణాంకాలను బయటపెట్టింది. అస్సాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎకరానికి ఏటా 100 టన్నులకు పైగా మట్టి కొట్టుకుపోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో హెక్టారుకు హెక్టారుకు ఏటా 15 నుంచి 30 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎడారీకరణకు గురవుతున్న రాయలసీమ వంటి కొన్ని చోట్ల ఏకంగా 50 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనం తేల్చింది. అడవుల నరికివేత, ప్రతి ఏటా అతిగా దుక్కిచేయటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులతో పాటు వాతావరణ మార్పులతో కుండపోత వర్షాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రం తమ భూముల్లో మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడుకోగలుగుతుండటం విశేషం. పోర్చుగల్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ గెల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ పురస్కారాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం ఇటీవల అందుకున్న సందర్భంలో.. ప్రకృతి సాగులో ఒక ముఖ్యభాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అనే వినూత్న పద్ధతి గురించి తెలుసుకుందాం. సాయిల్ ఎమర్జెన్సీ విపత్కర స్థితిని మానవాళి దీటుగా ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టి. విజయకుమార్ అంటున్నారు. 2023–24లో 8 లక్షల 60 వేల మంది రైతులు 3.80 లక్షల హెక్టార్లలో పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో ఎండాకాలంలో వానకు ముందే విత్తారు. పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందుగా వేసవిలోనే విత్తుకునే వినూత్న పద్ధతే పి.ఎం.డి.ఎస్. సాగు. 20 నుంచి 30 రకాల పంటల విత్తనాలను కలిపి వానాకాలానికి ముందే విత్తనాలు వేస్తున్నారు. వేసవి వర్షాలకు మొలుస్తాయి. సజీవ వేరు వ్యవస్థతో మట్టిని కా΄ాడుకుంటూ.. సారవంతం చేసుకునే ప్రక్రియ ఇది. 30–60 రోజుల్లో ఈ పంటలు కోసిన తర్వాత రైతులు ప్రధాన పంటలు విత్తుకుంటారు.ఎకరానికి టన్ను బయోచార్ కంపోస్టుయవత్మాల్ జిల్లాలోని 0.5% కన్నా తక్కువగా ఉండే వర్షాధార పత్తి తదితర పంటలు పండించే నేలలను బయోచార్ కంపోస్టు పోషకవంతం చేయటమే కాకుండా నీటిని పట్టి ఉంచే సామర్ధ్యాన్ని, కరువును తట్టుకునే శక్తిని పెంపొదించింది. బయోచార్ను ఎంత మోతాదులో వేయాలనే దాన్ని ఇంకా ప్రామాణీకరించాల్సి ఉంది. హెక్టారుకు 1 నుంచి 10 టన్నుల వరకు సూచిస్తున్న సందర్భాలున్నాయి. రైతుకు మరీ భారం కాకుండా వుండేలా హెక్టారుకు 2.5 టన్నుల (ఎకరానికి టన్ను) చొప్పున బయోచార్ కంపోస్టును వేయించాం. బొగ్గు పొడితో వర్మీకంకంపోస్టు, అజొటోబాక్టర్, అజోస్పిరిల్లమ్ వంటి జీవన ఎరువులను కలిపి బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని పంట పొలాల్లో వాడాం. ఆ సంవత్సరంలోనే పత్తి, సోయా వంటి పంటల దిగుబడి 12–15% పెరిగింది. పోషకాలను నిదానంగా దీర్ఘకాలం పాటు పంటలకు అందించేందుకు, బెట్టను తట్టుకునేందుకు బయోచార్ ఉపకరిస్తుంది. బయోచార్ వినియోగం వల్ల ఒనగూడే ప్రయోజనాలను రైతులు పూర్తిగా గుర్తించేలా ప్రచారం చేయటానికి ప్రభుత్వ మద్దుతు అవసరం ఉంది. ఎఫ్పిఓలు తయారు చేసే బయోచార్ కంపోస్టుకు ప్రభుత్వం మార్కెటింగ్‌కు అవకాశాలు పెంపొందించాలి.– గణేశ్ (98601 31646), బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్, పుణే -
అధిక వర్షాలతో పత్తికి విపత్తు
సాక్షి, హైదరాబాద్: వారం క్రితం వరకు వర్షాలు లేక ఇబ్బందులు పడగా, ఇప్పుడు ఎడతెరపి లేని వర్షాలతో పంటలను ఎలా కాపాడుకోవాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక చోట్ల పత్తి పంటకు చేటు కలుగుతోంది. పత్తితోపాటు ఇతర ఆరుతడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న, కంది వంటి పంటలకు కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల విత్తనాలు చల్లినచోట అధిక వర్షాలతో మునిగిపోయి ఆయా విత్తనాలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొలక వచ్చినచోట కలుపు సమస్య, వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లు వస్తున్నాయి. వీటికి తోడు నిరంతర వర్షాల కారణంగా బ్యాక్టీరియా తెగుళ్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాలు మొలకెత్తని చేలల్లో ఎక్కువ నీరు నిలిచిపోయే పరిస్థితి వస్తే పత్తి, సోయా, కంది వంటివి చేతికి రావనీ, వాటిని మరోసారి విత్తుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం మాజీ సంచాలకులు ప్రొఫెసర్ జగదీశ్వర్ అంటున్నారు. 38 లక్షల ఎకరాల్లో పత్తి సాగు... రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 57.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, 46.06 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇటీవల వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పంటల సాగు ఊపు మీద ఉంది. కాగా, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37.98 లక్షల ఎకరాల్లో (75.07%) సాగైంది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.94 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.05 లక్షల ఎకరాల్లో (98.21%) సాగైంది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల్లో సాగైంది. వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో ఆయా పంటలను కాపాడుకోవడం ఇప్పుడు రైతులకు కీలకమైన అంశంగా జగదీశ్వర్ చెబుతున్నారు. రైతులు ఏం చేయాలంటే? ఆరుతడి పంటలైన పత్తి, కంది, పెసర, సోయాచిక్కుడు, మొక్కజొన్న పంటల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమ పొలాల్లో నిలిచిన మురుగునీరు పోయేందుకు కాల్వలు ఏర్పరచాలి. వర్షాలు ఆగిన వెంటనే తమ పొలాల్లో కలుపు ఏమాత్రం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రై తులు పంటల వారీగా కలుపు మందులను ఎంచుకొని సరైన మోతాదులో పిచికారీ చేయాలి. సాధ్యమైనంతవరకు గుంటకతో కానీ, దంతెలతో గానీ కలుపు తీసివేయాలి. పత్తిలో అధిక వర్షాలకు వేరుకుళ్లు, కాండం కుళ్లు, కాయ కుళ్లు ఆశించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల మొదళ్లను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని లేదా కార్బండాజిమ్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలుపుకొని మొక్కల అడుగు భాగంలో పిచికారీ చేయాలి. ప్రస్తుతం భూమిలో తేమను ఆధారం చేసుకొని ఆరుతడి పంటల్లో పైపాటుగా ఎరువులను యూరియా 30 కేజీలు, పొటాష్ 15 నుంచి 20 కేజీలు కలుపుతీసిన తర్వాత మొక్కలకు బెత్తెడు దూరంలో మట్టిలో లోతుగా వేయాలి. మే జూన్లలో వేసిన పత్తిలో వర్షాలు ఆగిన వెంటనే పేనుబంక, పచ్చదోమ ఆశించేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం ఎస్పేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. వర్షాలకు వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు లేదా అగ్గితెగులు సోకేందుకు చాలా అనుకూల వాతావరణం ఉంది. దీంతో వర్షాలు ఆగిన వెంటనే ప్రైసైక్లోజల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని అగ్గి తెగులు నివారణకు చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం బ్యాక్టీరియా తెగులు గమనించినట్లయితే తాత్కాలికంగా నత్రజని ఎరువులను వేయడం, వారం పది రోజుల వరకు ఆగి ముందస్తు చర్యగా కాపర్ఆజిక్లోరైడ్ 30 గ్రాములు, స్ట్రెప్లోమైసిన్ సల్ఫేట్ రెండు గ్రామలు పది లీటర్ల నీటికి కలుపుకొని ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వరిలో ప్రస్తుతం వర్షాలను ఉపయోగించుకొని జూలై మాసాంతం వరకు స్వల్పకాలిక రకాలు (125 రోజులు) నారు పోసుకోవడానికి అనుకూలం. ఆ తర్వాత ఆగస్టు 15–20 తేదీల వరకు నాట్లు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మధ్యకాలిక రకాలు (135 రోజులు) లేదా స్వల్పకాలిక రకాలు కూడా నేరుగా దమ్ము చేసిన పొలంలో డ్రమ్ సీడర్ ద్వారా గానీ, వెదజల్లుకు నే పద్ధతిలో గానీ వరిని విత్తుకున్నట్లయితే దాదా పుగా 15–20 రోజుల సమయం కలిసి వచ్చి మంచి దిగుబడులు రావడానికి అవకాశముంది. వెదజల్లే పద్ధతిలో విత్తుకునేప్పుడు నేల బాగా చదును చేసి ఉండాలి. ఆ తర్వాత వరి విత్తిన మూడు నుంచి ఐదు రోజుల లోపుల సిఫారసు చేసిన కలుపుమందులు తప్పనిసరిగా వాడాలి. -
అమ్మ ప్రేమకు సజీవ సాక్ష్యం: నిలువెత్తు జ్ఞాపకం
బిడ్డల భవిష్యత్తు కోసం కలలు కంటూ వాళ్ల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది అమ్మ. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరెళ్లినా వారి జ్ఞాపకాలు మాత్రం ఆమె మెడ చుట్టూ చిట్టి చేతుల్లా అల్లుకుపోతూనే ఉంటాయి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన కంది నాగమణి పాతికేళ్ల క్రితం దేశసేవలో కానరాని దూరాలకు వెళ్లిన కొడుకును మళ్లీ కళ్లారా చూడాలనుకుంది. కొడుకు గొప్పతనాన్ని ఆ ఊరి ప్రజల ముందుకు తేవాలనుకుంది తనలాంటి కొడుకు వీధికొక్కరు పుట్టాలని నడివీధిలో విగ్రహాన్ని నిలబెట్టింది. కంది నాగమణి, శంకరయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. సాగునీటి వసతులు లేక వర్షాధారంపై ఆధారపడి సేద్యం చేస్తుండే వాళ్లు. నాగమణి ఇల్లు, వ్యవసాయపనులే కాదు బీడీలు చుట్టే పని కూడా చేస్తుండేది. పెద్ద కొడుకు సిద్దరాములు ఏడో తరగతి వరకు చిట్యాలలో చదువుకున్నాడు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు తాడ్వాయి మండల కేంద్రానికి వెళ్లి చదువుకున్నాడు. 1990 లో సీఆర్పీఎఫ్ జవానుగా సెలెక్టయ్యాడు. అప్పట్లో వాళ్ల గ్రామంలో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. పోలీస్ డిపార్టుమెంటులో చేరుతానని ముందుకెళ్లాడు. వద్దని వారించినా వెనకడుగువేయలేదు. ఇంకో అడుగు ముందుకేసి దేశం కోసం సేవ చేస్తానంటూ వెళ్లాడు. అప్పటికే ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. గుండెలో పేలిన బాంబు 1997 డిసెంబర్ 14న అస్సాంలోని కొక్రా జిల్లాలో బోడో తీవ్రవాదులు పేల్చిన మందుపాతరలో పది మంది వరకు జవాన్లు చనిపోయారు. అందులో సిద్దరాములు ఒకరు. ఇంటికి కబురందింది. తల్లి గుండె చెరువయ్యింది. సీఆర్పీఎఫ్ అధికారులు శవాన్ని తీసుకుని తాడ్వాయికి వచ్చారు. ఆ జ్ఞాపకాల్లోనే.. కొడుకు చనిపోయి పాతికేళ్లు దాటింది. అయినా, ఆ తల్లి మాత్రం కొడుకు జ్ఞాపకాల్లోనే కాలం గడుపుతోంది. చిన్నతనంలో చేసిన అల్లరి, పెద్దయ్యాక చూపిన గుండెధైర్యం ఆమెను రోజూ వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె ఆలనా పాలనా చిన్న కొడుకు విఠల్ చూసుకుంటున్నాడు. బీపీ, షుగర్ సమస్యలకు మందులు వాడుతోంది. నిత్యం కొడుకు గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వచ్చింది. బీడీ కార్మికురాలిగా రిటైర్ అయ్యాక పీఎఫ్‌లో జమ అయిన డబ్బులపై నెలనెలా పెన్షన్ వస్తోంది. ఆ డబ్బులతో కొడుకు విగ్రహం ఏర్పాటు చేయాలని పూనుకుంది. విగ్రహం తయారీకి, ఏర్పాటుకు ఎంతోమందిని కలిసి, తన కల గురించి చెబుతుండేది. దాదాపు రూ.లక్షా 60 వేలు ఖర్చు చేసి సిద్దరాములు నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించింది. జై జవాన్.. గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఈ నెల 27న జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది నాగమణి. కొడుకు జ్ఞాపకాలతో విగ్రహం ఏర్పాటు చేసిన తల్లిని అందరూ అభినందించారు. నాగమణి మాత్రం నాడు తన కొడుకుతో పాటు మరో పది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసుకుంది. దేశసేవలో జవాన్ల త్యాగం గురించి ఈ సందర్భంగా అందరూ గుర్తుచేసుకున్నారు. పిల్లలు సైతం జై జవాన్ అంటూ దేశసేవలో జవాన్ గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. కండ్ల ముందే తిరుగుతున్నట్టుంది చిన్నప్పటి నుంచి నా కొడుకులు ఎంతో కష్టపడి చదువుకున్నరు. తాడ్వాయికి నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. పెద్దోడు ఉద్యోగంలో చేరిన తరువాత మా కష్టాలు తీరినయి. ఆరేడేండ్లు ఉద్యోగం చేసిండో లేదో చనిపోయిండు. వాడు కనుమరుగై ఇరవై ఐదేండ్లవుతున్నా నా కండ్ల ముందర ఇంకా తిరుగున్నట్టే ఉంటది. యాది జేసుకోని రోజు ఉండది. ఊళ్లో అందరితో ఎంతో ప్రేమగా ఉండేటోడు. రోజూ వాని ఫోటో చూసుకుంటూ ఇన్నేళ్లు గడిపినా. నా కొడుకు లెక్కనే ఉండే విగ్రహం అందరికీ తెలిసేలా పెట్టించాలనుకున్నా. అది ఇన్నాళ్లకి తీరింది. సైనికుడైన నా కొడుకు నాకే కాదు మా ఊరికి కూడా గొప్ప పేరు తెచ్చిపెట్టిండు. – కంది నాగమణి, అమర జవాన్ సిద్దరాములు తల్లి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
జీఐ జర్నల్‌లో తాండూరు కంది ప్రత్యేకతలు
సాక్షి, హైదరాబాద్: గతేడాది డిసెంబర్లో తెలంగాణ నుంచి భౌగోళిక గుర్తింపు (జీఐ) సాధించిన వికారాబాద్ జిల్లా తాండూరు కందికి సంబంధించిన ప్రత్యేకతలను తాజాగా కేంద్రం ‘జీఐ జర్నల్’లో పొందుపరిచింది. వండిన పప్పు ఎక్కువకాలం నిల్వ ఉండటం, తొందరగా ఉడకడం, మంచి రుచి, వాసన తాండూరు కంది ప్రత్యేకతలని పేర్కొంది. అలాగే సానుకూల వాతావరణ పరిస్థితులు, రైతులు ఆచరించే సంప్రదాయ, ఆధునిక యాజమాన్య సాగు పద్ధతుల మూలంగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభించిందని వివరించింది. తాండూరు ప్రాంతంలో ఉన్న సున్నపురాయి నిక్షేపాల వల్ల వచ్చే పోషక నాణ్యతలే దీనికి కారణమని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలలో 1.48 లక్షల ఎకరాల్లో కంది సాగు జరుగుతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు కోసం వివిధ రంగాల నుంచి వెయ్యి దరఖాస్తులు రాగా వాటిలో 432 ఉత్పత్తులకు మాత్రమే భౌగోళిక గుర్తింపు లభించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ఏర్పడ్డాక ఆరింటికి.. తెలంగాణ ప్రాంతానికి చెందిన మొత్తం 16 ఉత్పత్తులకు ఇప్పటివరకు జీఐ హోదా లభించగా వాటిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆరు ఉత్పత్తులు ఈ ఘనత సాధించాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ హోదా పొందిన వాటిలో పుట్టపాక తేలియ రుమాలు (2015), బంగినపల్లి మామిడి (2017), ఆదిలాబాద్ ఢోక్రా, వరంగల్ డురీస్ (2018), నిర్మల్ పెయింటింగ్ (2019), తాండూరు కంది (2022) ఉన్నాయి. తాజాగా తాండూరు కంది భౌగోళిక గుర్తింపు సాధించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు, వ్యవసాయ విద్యాలయం సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్, కంది పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్‌లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు. ఈ నెల 31న కంది పరిశోధనా కేంద్రంలో తాండూరు రైతులు, శాస్త్రవేత్తలను అభినందిస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఐఐటీ–హైదరాబాద్‌లో భారీ టెలిస్కోప్
సాక్షి, సంగారెడ్డి: ఖగోళ కార్యకలాపాలపై పరిశోధనలకు శ్రీకారం చుట్టేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ కీలక ముందడుగు వేసింది. క్యాంపస్‌లో భారీ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌ఎస్‌టీ) స్థాపక డైరెక్టర్ డాక్టర్ బీఎన్ సురేశ్ సోమవారం టెలిస్కోప్‌ను ప్రారంభించారు. ఈ టెలిస్కోప్‌లో 165 మి.మీ. ఫోకల్ లెంగ్త్‌తో 355 మి.మీ (ఐఐటీ కాన్పూర్ తర్వాత రెండోది) ఆప్టికల్ వ్యాసం కలిగిన భారీ లెన్స్ ఉంటుందని సోమవారం ఐఐటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై చిన్న క్రేటర్లు, శని గ్రహ వలయాలు, ఉల్కాపాతం వంటి చిత్రాలను నమోదు చేసేందుకు వినియోగించొచ్చని పేర్కొంది. ఖగోళంపై అధ్యయనం చేసేందుకు విద్యార్థులకు ఈ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడుతుందని హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ మూర్తి పేర్కొన్నారు. స్టార్ గేజింగ్ శిక్షణ కార్యక్రమాలు, ఖగోళ చిత్రాలు తదితరాలపై అవగాహన పెంచుకోవచ్చని చెప్పారు. కాగా, ఐఐటీ హైదరాబాద్ ఆ్రస్టానమీ క్లబ్ ద్వారా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు కూడా ప్రయోజనాలు పొందేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో భౌతికశాస్త్ర విభాగం అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ ముయూఖ్‌పహారి పాల్గొన్నారు. -
కుమార్తె లవ్ మ్యారేజ్: కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య
సంగారెడ్డి: తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపానికి గురయిన ఆ భార్యాభర్తలు మనస్తాపం చెందారు. ప్రేమ పెళ్లి చేసుకుని తమ పరువు తీసిందని కానిస్టేబుల్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకుంది. కంది మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ నారాయణ జిన్నారం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య రాజేశ్వరి, కుమార్తె ఉన్నారు. అయితే వారం కిందట వారి కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. కూతురు ప్రేమ వివాహ చేసుకోవడంతో తమ పరువు పోయిందని నారాయణతో పాటు ఆయన భార్య రాజేశ్వరి కూడా భావిస్తున్నారు. అదే బాధతో మంగళవారం ఆ దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. -
భవనం పైనుంచి పడి ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి మృతి
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలోని కంది పట్టణంలో గురువారం అర్ధరాత్రి కలకలం రేగింది. కందిలోని ఐఐటీ-హైదరాబాద్ భవనం పైనుంచి పడి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందాడు. మృతుడు అనిరుధ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్నామని, ఘటనపై విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. ఐఐటీహెచ్‌లో అనిరుధ్య మెకానికల్ అండ్ ఏరోస్పేస్ కోర్సు చేస్తున్నాడు. -
విషాదం మిగిల్చిన హోలీ
సంగారెడ్డి రూరల్: హోలీ వేడుకల్లో స్నేహితులతో ఆడిపాడి ఇంటికి తిరుగుముఖం పట్టిన ఐదుగురు యువకులను రోడ్డు ప్రమాదం కబలించింది. సంగారెడ్డి సమీపంలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ వద్ద జాతీయ రహదారి 65పై శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేతకి డిజిటల్స్ నిర్వాహకుడు బాశెట్టి మహేశ్వర్ గుప్తా(28) తన స్నేహితులు వెంకట్రాంరెడ్డి (23), వెంకట్‌రెడ్డి (23), నాగరాజు (23), నరేందర్‌చారి (30)తో కలసి పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ప్రైవేటు హోటల్లో హోలీ వేడుకలకు హాజరయ్యారు. వేడుకలు ముగిసిన అనంతరం మహేశ్వర్ గుప్తా తన కారులో స్నేహితులతో కలసి సంగారెడ్డికి తిరుగు పయనమయ్యారు. కంది మండల కేంద్రం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు వెనుక టైరు పేలి అదుపు తప్పింది. డివైడర్‌ను దాటుకుని అవతలి వరుసలో జహీరాబాద్ నుంచి పటాన్‌చెరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును (ఏపీ 23 ఎక్స్ 3328) ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న మహేశ్వర్ గుప్తాతో పాటు నాగరాజు, నరేందర్‌చారి అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన వెంకట్రాంరెడ్డి, వెంకట్‌రెడ్డిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించిన కొద్ది నిమిషాలకే ఇద్దరూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతులంతా సంగారెడ్డికి చెందినవారే. ప్రమాద వార్త తెలిసి మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు మృతి ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన పవర్ శ్రీనివాస్(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. శుక్రవారం హోలీ వేడుకల అనంతరం స్నేహితులతో కలసి సమీపంలోని సాత్నాల వాగులో స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. -
కంది సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
కేంద్రానిది రైతు వ్యతిరేక ధోరణి
సాక్షి, హైదరాబాద్: కందుల సేకరణ, రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కందుల కొనుగోళ్లలో ఉదాసీనతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రైతు వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. కందుల కొనుగోలు సమస్యపై మంగళవారం సమీక్షించిన మంత్రులు.. కేంద్ర పౌర సరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు రాసిన లేఖలపై స్పందన లేకపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 75 వేల మెట్రిక్ టన్నుల సేకరణకే కేంద్రం అంగీకరించడంపై నిరసన తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం వైఖరి మార్చుకోవాలని, రైతుల ప్రయోజనాలు రక్షించేందుకు పునరాలోచించాలని కోరారు. రాష్ట్రంలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసినా మరో 1.50 లక్షల మెట్రిక్ టన్నులు మార్కెట్‌కు వస్తున్నట్లు వెల్లడించారు. కందుల కొనుగోలుపై ఈ నెల 15న ఢిల్లీలో మరోసారి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని హరీశ్ తెలిపారు. కంది రైతుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం రూ. 600 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చినందుకు సీఎం కేసీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కంది రైతుల బకాయిలు త్వరగా చెల్లించాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్మోహన్ను ఆదేశించారు. రాష్ట్రంలో కందుల దిగుబడి అనూహ్యంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి దొడ్డి దోవన దిగుమతి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులతో సంయుక్త తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు. 10 క్వింటాళ్ళకు పైగా తీసుకొస్తే నిఘా.. మార్క్‌ఫెడ్, హాకా ఏజెన్సీల అధికారులు రోజూ సాయంత్రానికి కందుల క్రయవిక్రయా లు సమీక్షించాలని.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద దీర్ఘకాలం పనిచేసే సిబ్బందిని తరచూ ఇతర కొనుగోలు కేంద్రాలకు మార్చా లని సూచించారు. నారాయణఖేడ్, నల్లగొం డ, వికారాబాద్ వంటి ప్రాంతాల్లో రైతుల ముసుగులో కందుల అమ్మకాలు జరిపిన వ్యాపారులపై చర్యలు తీసుకున్నట్లు హరీశ్ తెలిపారు. వారు తీసుకొచ్చిన కందులనూ జప్తు చేసినట్లు వెల్లడించారు. రైతుల ముసుగులో అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని.. ఇకపై స్థానిక వ్యవసా య అధికారులు నిర్ధారించి ధ్రువపత్రం ఇచ్చిన తర్వాతే సరుకులు కొనుగోలు చేయాలన్నారు. వారికి డబ్బులిచ్చే సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 10 క్వింటాళ్ళకు పైగా కందులను మార్కెట్‌కు తీసుకొచ్చే వారిపై నిఘా పెట్టాలన్నారు. సమీక్ష సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ బాయి, మార్క్ ఫెడ్, హాకా, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. సాగుకు ముందే కంపెనీలతో ఒప్పందం ధర కొనుగోలుపై పంట సాగుకు ముందే కంపెనీలు, రైతులు ఒప్పందం కుదుర్చునేలా వచ్చే ఏడాది నుంచి నిబంధన తీసుకొస్తామని మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎర్రజొన్నల ధర తగ్గి రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని నిజామాబాద్ ఎంపీ, ఆ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని.. తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారని మంత్రులు చెప్పారు. ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తామని, ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎర్రజొన్నలను కంపెనీలు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తాయని.. గతంలో విత్తక ముందే కొనుగోలు ఒప్పందం ఉండేదని, కొన్నేళ్లుగా రైతులు తమకు నచ్చిన కంపెనీలకు విక్రయిస్తున్నారన్నారు. ప్రస్తుతం పంట కోతలు జరుగుతున్నందున కంపెనీలు కావాలని ధర తగ్గించాయన్నారు. పశుగ్రాసం కోసం వినియోగించే ఎర్రజొన్నలకు కేంద్రం మద్దతు ధర వర్తించదని చెప్పారు. కొన్ని ప్రాంతాలలో ఎర్రజొన్నల రైతులను కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 2008లో కొనుగోలు చేసిన ఎర్రజొన్నల డబ్బులను 2014 వరకు కూడా చెల్లించని చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. -
కంది కొనుగోలు.. అడ్డగోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంది కొనుగోలు కేంద్రాల్లో భారీ అవకతవకలు జరిగా యి. దళారులే రైతుల పేరుతో కందులు విక్రయించి అందినకాడికి దండుకున్నారు. రైతుల నుంచి ముందే తక్కువ ధరకు కొని.. మద్దతు ధరకు అమ్ముకున్నారు. కంది కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలపై వ్యవసాయశాఖ నియమిం చిన టాస్క్‌ఫోర్స్ బృందాల పరిశీలనలో ఈ అక్రమాలు బయటపడ్డాయి. సంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్, గద్వాల, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిం చిన బృందాలు రైతులతో సంభాషించాయి. రాష్ట్రంలోని అన్నికొనుగోలు కేంద్రాల్లో లక్షన్నర మెట్రిక్ టన్నులకు పైగా కందులు కొనుగోలు చేస్తే, 30 వేల మెట్రిక్ టన్నుల మేరకు అక్రమంగా కొన్నట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 2.84 లక్షల మెట్రిక్ టన్నుల కంది ఉత్పత్తి అవుతుందని అంచనా. కంది మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,450 కాగా, మార్కెట్లో రూ.4 వేల లోపే ధర ఉంది. దీంతో కందులను మద్దతుకు కొనుగోలు చేసేందుకు 113 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడే దళారులు అక్రమాలకు తెరలేపారు. రైతుల నుంచి ముందే రూ.4 వేల చొప్పున కొని కొనుగోలు కేంద్రాల్లో రూ. 5,450కు విక్రయిస్తున్నారు. కందిని రెండు ఎకరాల్లో సాగు చేస్తే.. రైతు సాగు చేసిన ఇతర పంటలూ కలుపుకొని 9 ఎకరాలు సాగు చేసినట్లు వీఆర్వోలు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు టాస్క్‌ఫోర్స్ బృందాలు కొనుగోలు కేంద్రాల్లో జరిపిన పరిశీలనలో వెల్లడైంది. రైతుల ఆధార్ కార్డు, సంతకం తీసుకోకుండానే పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో వీఆర్వోలు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని తేలింది. రాష్ట్రంలో 33,500 మెట్రిక్ టన్నుల కందులే కొంటామని మొదట్లో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాం టిది ఒక్క పాలమూరులోనే 30వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని వెల్లడైంది. -
లక్ష టన్నుల కంది కొనండి
సాక్షి, హైదరాబాద్: లక్ష మెట్రిక్ టన్నుల కందిని కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌ను రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు శనివారం ఆయన లేఖ రాశారు. ఇప్పటి వరకు కేవలం 75,300 టన్నులే కొనుగోలు చేశారన్నారు. ఇది సరిపోదని, రాష్ట్రంలో 2.84 లక్షల మెట్రిక్ టన్నుల కంది ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామని, ఇంత తక్కువ కొనుగోలుతో రైతులు తీవ్రం గా నష్టపోతారని పేర్కొన్నారు. కాబట్టి మద్దతు ధరల ఫండ్ (పీఎస్ఎఫ్) కింద లక్ష టన్నులు కొనాలని పాశ్వాన్‌ను కోరారు. ప్రభుత్వం తక్కువ పరిమాణంలో కొంటే రైతులకు రూ. 5,450 మద్దతు ధర దక్కాల్సిందిపోయి మార్కెట్లో రూ.4,200 వరకే అం దుతుందని ఆ లేఖలో ప్రస్తావించారు. కాబట్టి ఇప్పడు పీఎస్ఎస్ పథకం కింద కొనుగోలు చేసిన 75,300 టన్నులు పోను, పీఎస్ఎఫ్ కింద అదనంగా లక్ష టన్నులు కొనాలన్నారు. ఇదిలావుంటే ఇదే అంశంపై సోమవారం మళ్లీ పార్టీ ఎంపీలు కేంద్రమంత్రి పాశ్వాన్‌ను కలవాలని హరీశ్‌రావు సూచించారు. -
11 నుంచి కంది కొనుగోలు కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: అవసరమైనచోట ఈ నెల 11వ తేదీ నుంచి కంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 95 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయాలని నిర్ణయించినట్లు ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసార«థి తెలిపారు. ‘కందుల ధర ఢమాల్’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు పార్థసారథి నేతృత్వంలో సోమవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాఫెడ్, మార్క్‌ఫెడ్, హాకా తదితర సంస్థల అధికారులు హాజర య్యారు. సమావేశం నిర్ణయాలను పార్థ సారథి ఒక ప్రకటనలో వెల్లడించారు. మార్కెట్లో కంది కనీస మద్ధతు ధర రూ. 5,450 కన్నా తక్కువగా ఉన్నందున ఈ విషయమై చర్చించామని పేర్కొన్నారు. కందుల ఉత్పత్తి ఈసారి 1.65 మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా వేసినందున అందుకు తగినట్లు 95 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. హాకా ఆధ్వర్యంలో సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, సూర్యా పేట్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుందన్నారు. మిగి లిన 23 జిల్లాలలో మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీగా నాఫెడ్ ఉంటుందని పేర్కొన్నారు. రైతులు 12% తేమ మించ కుండా కందులను తీసుకొని వచ్చేవిధంగా ఆయా మార్కెట్ యార్డుల తరపున అవ సరమైన ప్రచారాన్ని, అవగాహనను కల్పిం చాలని సూచించారు. శుభ్రపర్చే యంత్రా లను రైతులకు సరిపడా చేకూర్చాలన్నారు. సోయాబీన్ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు తగ్గినందున వారం రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేద్దామని అధికారులు పార్థసారథికి వివరించారు. మినుముల సేకరణ నాలుగు రోజుల్లో ముగుస్తుందని ఆయనకు వివ రించారు. సమీక్షలో వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి.లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
ఏకపంటగా కంది వేసుకోండి
అనంతపురం అగ్రికల్చర్ : ఏకపంటగా కంది వేయాలనుకునే రైతులు ఇపుడు విత్తుకోవచ్చని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. వాతావరణ పరిస్థితులు, పంటల సాగు గురించి ఆయన పలు సూచనలు చేశారు. + నైరుతీ రుతుపవనాలు జిల్లాలో విస్తరించాయి. ఈ రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు పడే అవకాశం ఉంది. 29 నుంచి 31 డిగ్రీలు గరిష్టం, 23 నుంచి 24 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావచ్చు. గాలిలో తేమశాతం ఉదయం 74 నుంచి 78, మధ్యాహ్నం 53 నుంచి 57 శాతం ఉండవచ్చు. గంటకు 11 నుంచి 19 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నాయి. + సాలు పదును అంటే వారం రోజుల వ్యవధిలో 60 నుంచి 70 మి.మీ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో పంటలు విత్తుకుంటే మేలు. అరకొర పదునులో వేసుకోవడం వల్ల మొలకశాతం తగ్గిపోతుంది. + మంచి పదును అయిన ప్రాంతాల్లో ఏకపంటగా కందికి జూన్ నెల అనుకూలం. దీర్ఘకాలిక రకాలైన ఎల్‌ఆర్‌జీ–30, ఎల్‌ఆర్‌జీ–41, స్వల్పకాలిక రకాలైన పీఆర్జీ–176, లక్ష్మి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోలు నత్రజని, 20 కిలోలు భాస్వరం ఎరువులు వేసుకోవాలి. + రైతులు ఈ వర్షాలను ఉపయోగించుకుని పొలాలను దున్నుకోవాలి. రెండు మడకల నాగలి లేదా సబ్సాయిలర్తో వాలుకు అడ్డంగా దున్నాలి. దీని వల్ల తేమ శాతం పెరగడంతో పాటు భూసారాన్ని కాపాడుకోవచ్చు. + భూసార పరీక్ష ఆధారంగా పంటలు వేసుకుని ఎరువులు వేస్తే పెట్టుబడి ఖర్చులు బాగా తగ్గుతాయి. + ఇపుడున్న వాతావరణ పరిస్థితులు అరటి పిలకలు నాటుకునేందుకు అనుకూలం. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల అరటి సాగు చేసుకోవచ్చు. + చీనీ కాయలు కోత పూర్తయిన ప్రాంతాల్లో కొద్దిరోజులు బెట్టకు గురిచేయాలి. కొత్తగా చీనీ తోటలు నాటుకునే రైతులు ఒక అడుగు లోతు, వెడల్పు గుంతలు తీసి అందులో 25 కిలోల పశువుల ఎరువు, ఒక కిలో సింగిల్ సూపర్‌పాస్ఫేట్, 100 గ్రాములు లిండేన్ పొడి వేసి నాటుకుంటే తెగుళ్లు, చీడ పీడల వ్యాప్తిని తగ్గించుకోవచ్చు. -
కంది పంటను కాపాడుకోండి
– వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి అనంతపురం అగ్రికల్చర్ : వర్షాభావ పరిస్థితుల కారణంగా బెట్టను ఎదుర్కొంటున్న కంది పంటకు శనగపచ్చపురుగు, మారుకామచ్చల పురుగులు, ఈగ రెక్కల పురుగులు ఆశించి నష్టం కలిగిస్తుండటంతో పంటను కాపాడుకునేందుకు రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లోనూ ఏకపంటగానూ, అంతర పంటగా కంది సాగైందన్నారు. బెట్ట నుంచి కొంత వరకు పంటను రక్షించడానికి ఓ వైపు ట్యాంకర్లు, రెయిన్గన్లు, పైపుల ద్వారా కంది పంటకు రక్షకతడులు కూడా ఇస్తున్నామని తెలిపారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైతులు ఒక తడి ఇచ్చుకుంటే మేలన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన సస్యరక్షణ సిఫారసులు పాటించి కందిని కాపాడుకోవాలని సూచించారు. + శనగపచ్చ పురుగు నివారణకు ముందు జాగ్రత్తగా 5 శాతం వేపగింజల కషాయంలేదా 5 మి.లీ వేపనూనె ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ, పూత దశలో 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ 20 ఈసీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పిందె, కాయ దశలో 2 మి.లీ క్వినాల్ఫాస్ 25 ఈసీ లేదా 1 గ్రాము అసిఫేట్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1 మి.లీ ఇండాక్సికార్బ్ లేదా 0.3 మి.లీ క్లోరాంట్రనిప్రొల్ లేదా 0.3 మి.లీ స్పైనోసాడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. + మారుకామచ్చల పురుగు నివారణకు కూడా శనగపచ్చ పురుగుకు సిఫారసు చేసిన మందులను వాడవచ్చు. పొలంలో పురుగు గూళ్లు గమనిస్తే 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ 20 ఈసీ లేదా 1 మి.లీ నొవాల్యురాన్ లేదా 2 మి.లీ క్వినాల్ఫాస్ 25 ఈసీ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ ఇందులో ఏదో ఒక మందుకు ఊదర స్వభావం కలిగిన 1 మి.లీ డైక్లోరోవాస్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. + కాయతొలిచే ఈగ నివారణకు ఎకరాకు 8 నుంచి 10 కిలోలు వేపగింజల పొడి కషాయాన్ని పిందె దశలో పిచికారీ చేస్తే పెద్ద పురుగులు గుడ్లు పెట్టవు. 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. -
కందికి రక్షకతడి ఇవ్వండి
వీడియోకాన్ఫరెన్స్‌లో అధికారులకు కలెక్టర్ కోన శశిధర్ ఆదేశం అనంతపురం అగ్రికల్చర్: వర్షాభావ పరిస్థితు ల వల్ల ఎండుతున్న కంది పంటకు రెయిన్గన్ల ద్వారా రక్షకతడులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. సోమవారం ఉదయం రూరల్ మండలం ఉప్పరపల్లి వద్ద కంది పంటను పరిశీలించిన కలెక్టర్... సాయంత్రం వ్యవసాయశాఖ ఏఓ, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏక పంటగానూ, అంతర పంటగా వేసిన కంది ప్రస్తుతం బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. రెయిన్గన్లను ఉపయోగించి కంది మొదళ్ల వద్ద నీటి తడులు ఇవ్వాలన్నారు. ప్రస్తుతానికి పూర్తిగా ఎండిపోతున్న దశలో ఉన్న 4 వేల హెక్టార్ల పంటకు యుద్ధప్రాతిపదికన తడి ఇవ్వాలని ఆదేశించారు. అందుకోసం కలెక్టరేట్లో కమాండ్ అండ్ కంట్రోల్‌రూం పనిచేస్తుందన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్ 18004256401 అందుబాటులో పెట్టామన్నారు. ఇందులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యవేక్షణ బాధ్యత ఆర్డీవోలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ–1 బి.లక్ష్మీకాంతం, జేసీ–2 ఖాజామొహిద్ధీన్, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్, వ్యవసాయశా ఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ నాగభూషణం, జె డ్పీ సీఈవో రామచంద్ర, డీపీఓ జగదీశ్వరమ్మ, శా స్త్రవేత్తలు సహదేవరెడ్డి, సంపత్‌కుమార్, నాయక్, పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొన్న లారీ
ఆరుగురి దుర్మరణం.. మెదక్ జిల్లా కంది శివారులో ఘటన సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న ఆటోను కంది గ్రామ శివారులోని ఐఐటీ వద్ద లారీ వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆటోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుల్లో పుల్కల్ మండలం శివ్వంపేటకు చెందిన నిరూప(35), నవీన్‌కుమార్(28), సదాశివపేట మండలం సిద్దాపూర్‌కు చెందిన ప్రకాష్‌గౌడ్(28), బండ్లగూడకు చెందిన రెడ్డిపల్లి యాదమ్మ(35) ఉన్నారు. గాయపడిన వారిలో ఆటో డ్రైవర్ రాజేష్(30), కందికి చెందిన శివకుమార్(28), సదాశివపేటకు చెందిన నిరీక్షణ్(26) ఉన్నారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ రాహుల్‌బొజ్జా, సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న సందర్శించారు. సీఎం దిగ్భ్రాంతి: మెదక్ జిల్లా కంది ఐఐటీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. -
ఈ వారం వ్యవసాయ సూచనలు
కంది, కొర్ర,, వేరుశనగ సాగు మేలు * ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని కంది, కొర్ర, రాగి, వేరుశనగ, పత్తి, పశుగ్రాసాలు సాగు చేసుకోవచ్చు. * విత్తే ముందు రైతులు తమ సొంత విత్తనాన్ని వాడుకున్నట్లయితే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి లేదా శుద్ధి చేసిన విత్తనాన్ని మార్కెట్లో కొనుగోలు చేయాలి. * వర్షాధారపు పంటలన్నింటిలోనూ సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడడం వలన భూసారం పెరగడమే కాకుండా నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, వేరుశనగ చెక్క, వేప చెక్క, కానుగ చెక్కలను వాడుకోవచ్చు. * నూనె గింజ పంటలకు తప్పనిసరిగా సల్ఫర్ ఉన్న భాస్వరపు ఎరువులను వాడాలి. అన్ని పంటలకు మొత్తం భాస్వరపు ఎరువును ఆఖరి దుక్కిలోనే వేయాలి. భూసార పరీక్షను అనుసరించి ఎరువులను వేసుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. * వర్షాలు తక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకుగాను, వాలుకు అడ్డంగా విత్తుకోవడం, వాలును అనుసరించి మడులను చిన్నవిగా చేసుకోవడం, వాలు ఎక్కువగా ఉన్నచోట్ల లోతైన గొడ్డు చాళ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ వాలు ఉన్న చోట్ల మట్టితోగాని, రాతి కట్టడంతో లేదా జీవ కంచెతో గాని అడ్డు ఏర్పాటు చేసుకోవడం వలన నీటిని అక్కడే ఇంకేలా చేసుకోవడమే కాకుండా మట్టి కొట్టుకు పోకుండా నివారించవచ్చు. * వర్షాకాలంలో కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తిన 24 గంటల్లోపు ఆయా పంటలకు సిఫారసు చేసిన కలుపు పైమందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. * కంది పంటకు పెండిమిథాలిన్ 1 నుంచి 1.5 లీటర్లు లేదా అలాక్లోర్ 1 లీటరు. ఆముదం పంటకు పెండిమిథాలిన్ 1.3 - 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 800 మి.లీ. నుంచి ఒక లీటరు. పత్తిలో విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 1 లీటరు/ విత్తిన తర్వాత పెండిమిథాలిన్ 1.3 నుంచి 1.6 లీ./ అలాక్లోర్ 1.5-2 లీటర్లను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్