సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంది కొనుగోలు కేంద్రాల్లో భారీ అవకతవకలు జరిగా యి. దళారులే రైతుల పేరుతో కందులు విక్రయించి అందినకాడికి దండుకున్నారు. రైతుల నుంచి ముందే తక్కువ ధరకు కొని.. మద్దతు ధరకు అమ్ముకున్నారు. కంది కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలపై వ్యవసాయశాఖ నియమిం చిన టాస్క్‌ఫోర్స్ బృందాల పరిశీలనలో ఈ అక్రమాలు బయటపడ్డాయి. సంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్, గద్వాల, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిం చిన బృందాలు రైతులతో సంభాషించాయి. రాష్ట్రంలోని అన్నికొనుగోలు కేంద్రాల్లో లక్షన్నర మెట్రిక్ టన్నులకు పైగా కందులు కొనుగోలు చేస్తే, 30 వేల మెట్రిక్ టన్నుల మేరకు అక్రమంగా కొన్నట్లు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో 2.84 లక్షల మెట్రిక్ టన్నుల కంది ఉత్పత్తి అవుతుందని అంచనా. కంది మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,450 కాగా, మార్కెట్లో రూ.4 వేల లోపే ధర ఉంది. దీంతో కందులను మద్దతుకు కొనుగోలు చేసేందుకు 113 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడే దళారులు అక్రమాలకు తెరలేపారు. రైతుల నుంచి ముందే రూ.4 వేల చొప్పున కొని కొనుగోలు కేంద్రాల్లో రూ. 5,450కు విక్రయిస్తున్నారు.
కందిని రెండు ఎకరాల్లో సాగు చేస్తే.. రైతు సాగు చేసిన ఇతర పంటలూ కలుపుకొని 9 ఎకరాలు సాగు చేసినట్లు వీఆర్వోలు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు టాస్క్‌ఫోర్స్ బృందాలు కొనుగోలు కేంద్రాల్లో జరిపిన పరిశీలనలో వెల్లడైంది. రైతుల ఆధార్ కార్డు, సంతకం తీసుకోకుండానే పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో వీఆర్వోలు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని తేలింది. రాష్ట్రంలో 33,500 మెట్రిక్ టన్నుల కందులే కొంటామని మొదట్లో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాం టిది ఒక్క పాలమూరులోనే 30వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment