సాక్షి, హైదరాబాద్: లక్ష మెట్రిక్ టన్నుల కందిని కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌ను రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు శనివారం ఆయన లేఖ రాశారు. ఇప్పటి వరకు కేవలం 75,300 టన్నులే కొనుగోలు చేశారన్నారు. ఇది సరిపోదని, రాష్ట్రంలో 2.84 లక్షల మెట్రిక్ టన్నుల కంది ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామని, ఇంత తక్కువ కొనుగోలుతో రైతులు తీవ్రం గా నష్టపోతారని పేర్కొన్నారు.
కాబట్టి మద్దతు ధరల ఫండ్ (పీఎస్‌ఎఫ్) కింద లక్ష టన్నులు కొనాలని పాశ్వాన్‌ను కోరారు. ప్రభుత్వం తక్కువ పరిమాణంలో కొంటే రైతులకు రూ. 5,450 మద్దతు ధర దక్కాల్సిందిపోయి మార్కెట్లో రూ.4,200 వరకే అం దుతుందని ఆ లేఖలో ప్రస్తావించారు. కాబట్టి ఇప్పడు పీఎస్‌ఎస్ పథకం కింద కొనుగోలు చేసిన 75,300 టన్నులు పోను, పీఎస్‌ఎఫ్ కింద అదనంగా లక్ష టన్నులు కొనాలన్నారు. ఇదిలావుంటే ఇదే అంశంపై సోమవారం మళ్లీ పార్టీ ఎంపీలు కేంద్రమంత్రి పాశ్వాన్‌ను కలవాలని హరీశ్‌రావు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment