నాన్న స్టార్ బ్యాట్స్మెన్...:కవిత | kavitha comments on kcr birthday celebrations | Sakshi
Sakshi News home page

నాన్న స్టార్ బ్యాట్స్మెన్...:కవిత

Published Tue, Feb 17 2015 12:33 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

నాన్న స్టార్ బ్యాట్స్మెన్...:కవిత - Sakshi

నాన్న స్టార్ బ్యాట్స్మెన్...:కవిత

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్టార్ బ్యాట్స్మెన్ అని....చిన్న బౌలర్లను చూసి ఆయన భయపడరని కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. పుట్టినరోజు జరుపుకోవటం మొదటి నుంచి కేసీఆర్కు అలవాటు లేదని ఆమె తెలిపారు.

 

'నా చిన్నప్పుడు ...నాన్న పుట్టినరోజు అయితే నేనే చాక్లెట్లు పట్టుకుని తిరిగేదాన్ని. ఆయనకు అసలు పుట్టినరోజు అని గుర్తే ఉండదు. రోజు మాదిరే తనపని తాను చేసుకుంటూ వెళిపోతారు. అభిమానులకు, ఇంట్లోవారికి, పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ బర్త్డే అంటే ప్రత్యేకత కాని, ఆయనకు కాదు' అని కవిత తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ముంబయి పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్ర సీఎంతో ఆయన భేటీ కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement