టైగర్‌జోన్‌లో కానరాని పులిజాడ
* పెరిగిన చుక్కల దుప్పుల సంతతి
* జంతుగణన పూర్తి
జన్నారం: కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశంగా ప్రకటించి మూడు సంవత్సరాలు అవుతున్నా అభయారణ్యంలో పులి జాడ కని పించడంలేదు. టైగర్‌జోన్‌గా ప్రకటించిన నుంచి మూడు సం వత్సరాలుగా జంతు గణన జరి గినా ఈ గణనలో పులి అడుగులు ఉన్నట్లు కనిపించలేదు. గత నెల 24 నుంచి 30 వరకు జన్నారం అటవీ డివిజన్‌లోని ఇందన్‌పల్లి, జన్నారం, తాళ్లపేట్, బీర్షాయిపేట్ అటవి రేంజ్‌లలో జంతుగణన నిర్వహించారు.
రేంజ్‌లలోని బీట్ స్థాయి నుంచి సెక్షన్ స్థాయికి, అక్కడి నుంచి అన్ని సెక్షన్‌ల నుంచి రేంజ్ కార్యాలయానికి జంతువుల లెక్కలను అందించరు. ఇప్పుడు రేంజ్‌ల నుంచి డివిజన్ కేంద్రానికి వచ్చాయి. వీటిని పరిశీలిస్తే గతంలో పోలిస్తే చిరుత పులల సంఖ్య కూడా పడిపోయినట్లు తెలుస్తుంది. గతంలో చిరుత పులులు 30 వరకు ఉండగా ఇప్పుడు 12 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని చిరుతలు ఇక్కడి నుంచి వెళ్లగా మరి కొన్ని చిరుతలు వేటకు గురయ్యాయని అధికారులు అంటున్నారు. అధికారుల లెక్కల ప్రకారం..
శాఖాహార జంతువులు
చుక్కల దుప్పులు చిన్నవి పెద్దవి కలిపి 662, గండి జింకలు 30, కృష్ణ జింకలు 05, నీలుగాయిలు 198, సాంబర్లు 13, బుర్ర జింకలు 33, అడవి దున్నలు 93, అడవి పందులు 933, అడవి కోళ్లు 3, కొండ ముచ్చులు 382, కుందేళ్లు 57, కొండగొర్రెలు 02, నెమల్లు ఆడ 47, మగ నెమల్లు 73,
మాంసాహార జంతువులు
చిరుతపులులు 11 మగవి, 1 ఆడ చిరుతపులి, రేసుకుక్కలు 64, ఎలుగుబంట్లు 75, నక్కలు 13, తోడేళ్లు 13, అడవిపిల్లులు 19, కొండ్రిగాడు 2 ఉన్నట్లు ఉన్నాయి. పులి రాక కోసం ఎదురు చూస్తు న్న అధికారులకు ఈ గణనలో పులి జాడ కనిపించకపోవడం అంసతృప్తికి లోను చేస్తోంది.