హైదరాబాద్: వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ వారం రోజులుగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మంత్రితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. మంచి వైద్యం అందించాలని వైద్యులకు సీఎం సూచించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఈటెల రాజేందర్, జి. జగదీశ్వరరెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కూడా ఉన్నారు. అలాగే, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ప్రజా గాయకుడు గద్దర్ కూడా నాయినిని పరామర్శించి వెళ్లారు. మంత్రి నాయిని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, నీరసంగా ఉండటంతో మరికొద్ది రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. కాగా, ఇదే ఆస్పత్రిలో న్యూరో సమస్యతో చికిత్స పొందుతున్న హోం మంత్రి నాయిని కుమారుడు దేవేందర్‌రెడ్డి పూర్తిగా కోలుకోవడంతో శనివారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు.