సాక్షి, నిజామాబాద్: రాష్ట్రంలో 16 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పుతానంటున్న సీఎం కేసీఆర్ 20 స్థానాలు గెలిచినా చిన్న స్క్రూను కూడా తిప్పలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. గతంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ కార్మికుల సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీ య అధ్యక్షులు అమిత్‌షా పర్యటన ఏర్పట్లను పరిశీలించేందుకు మంగళవారం నిజామాబాద్‌కు వచ్చిన లక్ష్మణ్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫెడరల్, థర్డ్ ఫ్రంట్‌లన్నీ ఫ్యామిలీ ఫ్రంట్‌లేనని, అవినీతి ఫ్రంట్‌లేనని దుయ్యబట్టారు. కుటుంబపాలనకు వ్యతిరేకంగా బీజేపీ పాలన ఉంటుందని అన్నారు.
కేసీఆర్ కలలు కనే ముందు.. ఈ ఫ్రంట్‌ల నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించాలన్నారు. మోడీ హవాలో కొట్టుకుపోతామనే భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, అధికారంలోకి వచ్చాక రెండు నెలలకు మంత్రి వర్గ విస్తరణ చేశారని విమర్శించారు. ఆర్థిక, నీటి పారుదల వంటి కీలకమైన శాఖలన్నీ తమ వద్దే ఉంచుకున్న కేసీఆర్.. సమయం కేటాయించకపోవడంతో వేలల్లో ఫైళ్లు గుట్టల్లా పేరుకు పోయాయని నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఫలితాలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. తరచూ ఉప ఎన్నికలకు వెళ్లే కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. యువరాజుకు పట్టాభిషేకం చేయలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment