కొత్తగా ఏడు జిల్లాలకు తెలంగాణ సర్కార్ పచ్చజెండా!
హైదరాబాద్: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాల ఏర్పాటుకు అవసరమయ్యే సమాచారం సిద్ధం చేయాలంటూ సీసీఎల్ ఏను టీఎస్ సర్కారు కోరింది.
తొలిదశలో ఏడు జిల్లాల ఏర్పాటు చేయనున్నట్టు అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించినట్టు తెలుస్తోంది. తొలి విడుతగా మంచిర్యాల, జగిత్యాల, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు జిల్లాలను ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.